హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… కానీ అంతలోపు..? ఈ సినిమా చూశారా..?

Ads

సినిమా అంటే పెద్ద పెద్ద సెట్టింగ్స్, ఎక్కువ బడ్జెట్, ఫైటింగ్ సీన్స్, పాటలు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు. సినిమాని ప్రేక్షకులు చూస్తారు. అలాంటి ఒక సినిమా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా, తెలుగులో ఆహాలో విడుదల అయ్యి చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా పేరు మాయానది. మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ ఇందులో హీరోగా నటించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించారు. మలయాళంలో 2017 లో ఈ సినిమా విడుదల అయ్యింది. మంచి విజయం సాధించింది.

mayanadhi review telugu

తెలుగులో ఈ సినిమా ఆహాలో ఉంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇంజనీరింగ్ చదివే సమయంలో అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి), మాధవ్ (టోవినో థామస్) ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. మాధవ్ ఒక కేసులో ఇరుక్కుంటాడు. మరొక పక్క అపర్ణ హీరోయిన్ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మాధవ్ ఆ కేసు నుండి బయటపడి తనతో పాటు అపర్ణని కూడా తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అపర్ణ ఏమో హీరోయిన్ అవడానికి ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది. తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది.

Ads

ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టదు. కొంత మంది ప్రముఖ హీరో, హీరోయిన్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపిస్తారు. నిజంగా సినిమాల్లోకి వెళ్దాం అని అనుకున్న అమ్మాయి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది అనేది ఈ సినిమాలో చూపిస్తూనే, ప్రేమ కథని చూపించారు. ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. క్లైమాక్స్ అయితే కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా అందరూ చాలా బాగా నటించారు.

ఆషిక్ అబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాధారణ ప్రేమ కథకి ఉన్నట్టుగా ఈ సినిమాకి ముగింపు ఉండదు. అయినా కూడా, ప్రేమ కథలు ఇష్టపడేవారు ఈ సినిమాని చూసి చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేశారు. ఎంతో మంది క్రిటిక్స్ కూడా ఈ సినిమాని పొగిడారు. కుటుంబం అంతా కూడా చూసే ఒక ఎమోషనల్ సినిమా ఇది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు.

Previous articleఏపీలో ఆ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన!
Next articleపాకిస్థాన్ 3000 బాంబులతో అటాక్ చేసినా ఒక్క గీత పడని ఆలయం.. ఎక్కడ ఉందంటే..?