Ads
బాలనటి గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా తరువాత మంచి నటిగా పేరు తెచ్చుకొని అందరి ప్రశంసలు అందుకుంది. బాలనటి గా చాలా సినిమాలు చేసినప్పటికీ పెద్దయ్యాక సీతారామయ్యగారి సినిమాలో మొదటిసారిగా మెయిన్ లీడ్ లో నటించింది. ఆ సినిమాలో ఆమె అందం,ఆమె నటన సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశాయి. అయితే అంతకుముందు కర్తవ్యం సినిమాలో నటించినప్పటికీ అది కేవలం చిన్నపాత్ర మాత్రమే. అయితే సీతారామయ్యగారి మనవరాలు సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది మీనా.
ఆ తర్వాత హీరోయిన్ గా కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయింది. తర్వాత ఆమెకి ఒక పాప పుట్టడం, ఆమె బాగోగులు చూసుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి కొంత దూరమైందనే చెప్పాలి. దురదృష్టవశాత్తు కోవిడ్ లో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయారు. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవటానికి మీనా కి చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే టెలివిజన్ ప్రోగ్రామ్స్, సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ అవుతుంది.
Ads
ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న సెలబ్రిటీ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది మీనా. చాలా సంవత్సరాల తర్వాత ఉదయభాను యాంకర్ గా రీ యంట్రీ ఇచ్చిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం కి మీనా తో పాటు హీరోయిన్ శ్రీదేవి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ డాన్స్ షోలో చంటి సినిమాలో ఒక పాటని రీ క్రియేట్ చేశారు కంటెస్టెంట్స్. పర్ఫామెన్స్ కూడా చాలా బాగా చేశారు.
అయితే పాట చూసిన మీనా పాత జ్ఞాపకాలలోకి వెళ్లిపోయి అప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటూ స్టేజి మీదే ఆ సంఘటన గురించి చెప్పింది. సినిమా క్లైమాక్స్ లో గాజు పెంకులు తొక్కుకుంటూ వచ్చి వెంకటేష్ ని ముద్దు పెట్టుకోవాలి. ఆ సీన్ నేను చేసేశాను కానీ వెంకటేష్ బాగా భయపడిపోయారు అని నవ్వుతూ చెప్పింది. వెంటనే షో లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వటంతో షో మొత్తం నవ్వులు విరబూసాయి.