“బాలయ్య”తో నటించడానికి మూడు సార్లు “నో” చెప్పిన హీరోయిన్…15 ఏళ్ల క్రితం కలిసి నటించారు కానీ.?

Ads

నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా విన్నర్ గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఓ సినిమాలో నటిస్తున్నారు.

బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కావలసినన్ని డేట్లు కూడా ఇచ్చేస్తారు. అందులోనూ ఆయన పక్కన హీరోయిన్ పాత్ర అంటే నో చెప్పే ఉండదు. కానీ ఒక హీరోయిన్ మాత్రం బాలకృష్ణ పక్కన నటించడానికి నో చెప్పింది అంట. అది ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడోసారి నో చెప్పింది అంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏంటా కథ….!

బాలకృష్ణ అఖండ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఆ సినిమాలో మొదట హీరోయిన్ మీరాజాస్మిన్ ను ఎంపిక చేశారట. అయితే అప్పుడు ఆమె నో చెప్పింది అంట. తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఆ సినిమాలో హనీరోజ్ నటించిన పాత్ర కోసం మళ్ళీ మీరాజాస్మిన్ మేకర్స్ కాంటాక్ట్ అయ్యారట. అప్పుడు కూడా మీరాజాస్మిన్ నో చెప్పారట.

Ads


తర్వాత ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఒక సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మీరాజాస్మిన్ ని కాంటాక్ట్ అవ్వగా ఈసారి కూడా నో చెప్పేసారట. అసలు మీరాజాస్మిన్ ఇన్నిసార్లు ఎందుకు నో చెప్పారు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. గతంలో 2007 లో మహారథి సినిమాలో వీరు ఇద్దరు జతకట్టారు. మీరాజాస్మిన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచి మంచి సినిమాలు చేసి కెరీర్ బ్రేక్ తీసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆమె మంచి ఫామ్ లో ఉన్నారు. బాలయ్య పక్కన ఆఫర్ వస్తే రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మేకర్స్ ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తారా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Previous articleసినిమా రంగంలో సక్సెస్ అయిన సరిత నిజ జీవిత కథ గురించి తెలుసా..? 16 సంవత్సరాలకే..?
Next articleగుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? ఇటీవలే సూపర్ హిట్ కొట్టారు..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.