Ads
మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు కచ్చితంగా అనౌన్స్మెంట్ వినే ఉంటారు.యాత్రిగన్ కృప్యా ధ్యాన్ దే… అంటే ప్రయాణికులు కాస్త శ్రద్ధ వహించండి…అంటూ వచ్చే ఒక అనౌన్స్మెంట్ మనం స్టేషన్ లో ఏ మూల ఉన్నా సరే మనకు వినిపిస్తుంది. ట్రైన్ వచ్చే ముందు కచ్చితంగా మనకి అనౌన్స్మెంట్ అలవాటే కానీ ఆ అనౌన్స్మెంట్ లో ఉన్న గొంతు ఎవరిది అని మీకు తెలుసా మీకు తెలుసా?
రైల్వే స్టేషన్ లో వినిపించే ఆ స్వరం వెనక ఉన్న వ్యక్తి పేరు సరళా చౌదరి. 1982లో వందలాదిమంది అభ్యర్థులతో పాటు సరళా చౌదరి కూడా సెంట్రల్ రైల్వేలో అనౌన్సర్ పదవికి హాజరు కావడం జరిగింది. అలా అనుకోకుండా సరళా చౌదరి అనౌసర్ పోస్ట్ కి ఎంపిక అయింది అయితే అది తాత్కాలికమైన ఉద్యోగం మాత్రమే. అయితే ఎప్పుడైతే సరళా స్వరం విని ప్రయాణికులు అలర్ట్ అవుతున్నారు అని రైల్వే డిపార్ట్మెంట్ గమనిచడంతో .. 1986లో పోస్టుని పెర్మనెంట్ చేసారు.
Ads
ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్లో వింటున్న ఆమె వాయిస్ ప్రీ రికార్డెడ్ వాయిస్. ఈ వాయిస్ ని దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. కొత్త రైళ్ల పేర్ల కోసం మధ్యలో మరొక వాయిస్ ని కూడా జోడించడం జరిగింది కానీ అది మనం ఎంత విన్నా తేడా తెలుసుకోలేము. ప్రస్తుతం ఆమె పదవిలో లేకపోయినా ఆమె స్వరం మాత్రం నేటికీ రైల్వేస్ కోసం పని చేస్తూనే ఉంది.