17 ఏళ్ళ తరువాత ఆ హీరోయిన్ తో జతకడుతున్న మెగాస్టార్…ఎవరంటే.?

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా భారీ బడ్జెట్‍ తో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి బింబిసార మూవీ దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి 156వ మూవీగా  తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాని మెగా156 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

Ads

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన సీనియర్ హీరోయిన్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియాలో రేంజ్ లో తెరకెక్కతున్న మెగా156 మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాంగ్ రికార్డింగ్‍తో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.  సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో పలు వార్తలు వచ్చాయి. అనుష్క శెట్టి, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ ఈ మూవీలో నటించనున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ చిత్ర‌బృందం హీరోయిన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మెగా 156 మూవీలో నటించే హీరోయిన్ గురించి నెట్టింట్లో మరోసారి వైరల్ గా మారింది. మెగా156 మూవీలో చిరంజీవి పక్కన సీనియర్ హీరోయిన్ త్రిష ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఇది వాస్తవం అయితే సుమారు 17 ఏళ్ళ త‌రువాత త్రిష చిరంజీవితో న‌టించ‌నుంది. వీరిద్దరూ ఇంతకుముందు స్టాలిన్ మూవీలో జంటగా నటించారు. ఆ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత వీరి కాంబోలో మూవీ రాబోతుందని నెట్టింట్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రిష ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారు. పోన్నియన్ సెల్వన్ తో ఆకట్టుకున్న త్రిష, రీసెంట్ గా లియో మూవీతో అలరించింది. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: సూపర్ స్టార్ “రజనీకాంత్” వేళ్లు ఇలా ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఏంటంటే..?

 

 

Previous article90’s లో కుర్రాళ్ళ కలల దేవత… ఇప్పుడు ఇలా మారిపోయింది.! ఎవరో గుర్తుపట్టారా.?
Next articleRTC BUS FREE SCHEME IN TELANGANA:ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్ ను ఆడవాళ్లు ఇలా కూడా ఉపయోగిస్తారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.