Ads
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఆ పేరు తెలియని వారు ఉండరు. ఇక ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి స్వయం కృషితో ఎదిగాడు.
Ads
ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విలన్ పాత్రలలో నటించారు. ఆ తరువాత హీరోగా అవకాశాలను అందుకున్నారు. ఆయన పరిశ్రమలో ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చిరంజీవి టాలీవుడ్ ని శాసించే స్థాయికి చేరుకున్నారు. మెగాస్టార్ హీరోగా ఎన్నో సినిమలలో నటించాడు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. మరెన్నో రికార్డులను సృష్టించాడు.మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన అనంతరం ఆయనఫ్యామిలీ మెంబర్స్ కూడా సినీ పరిశ్రమలోకి వచ్చారు. అలా చెప్పినప్పుడు అందరికీ ఆయన తమ్ముళ్ళు నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఆయన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ గుర్తొస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మెగాస్టార్ తండ్రి వెంకట్రావు కూడా నటన పై ఉన్న ఇష్టంతో సినిమాలలో నటించారు.
అయితే మెగాస్టార్ తండ్రి కూడా నటించారని ఎక్కువగా తెలియదు. ఇంతకి ఆయన ఏ సినిమాలో నటించాడంటే బాపు గారి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చేసిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ అనే చిత్రంలో నటించారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల్లోకి రాకముందే 1969 లో వచ్చిన జగత్ కిలాడీలు అనే మూవీలో కూడా నటించారు. ఈ సినిమా తరువాత ఆయనకు వరుసగా నటించే అవకాశాలు వచ్చినా, నటుడిగా కొనసాగలేకపోయారు.
ఎందుకంటే వెంకట్రావు వృత్తి కానిస్టేబుల్ కావడం, కుటుంబ బాధ్యతల కోసం, తనకెంతో ఇష్టమైన సిని రంగాన్ని వదిలిపెట్టి, ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను నెరవేర్చారు. ఇక తండ్రిలాగానే ఆయన కుమారుడు చిరంజీవి నటన పై ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అంచలంచలుగా ఎదిగి, టాలీవుడ్ లో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి నటించిన 17 రీమేక్ సినిమాలలో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా?