Ads
ఇప్పుడు మనకి ఫోటోలు ఎక్కువగా ఉన్నట్లే అప్పట్లో పెయింటింగులు ఎక్కువగా ఉండేవి. వాటిలో అందమైన మహిళల ఫోటోలు కూడా ఉండేవి. అయితే ఇక్కడ ఉన్న ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ముగ్గురు రాజవంశ కాలం నాటి స్త్రీలు ఉన్నారు. వీళ్ళు చక్కగా పెయింటింగ్ కి పోజ్ ఇస్తున్నారు. అయితే ఇద్దరమ్మాయిలు బాగానే ఉన్నారు. మూడో అమ్మాయి మాత్రం తన చీరని ఎత్తి పెట్టి చూపిస్తోంది. దీని వెనుక కారణం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం.
నిజానికి దీని వెనుక పెద్ద సందేశం ఉంది. అయితే అసలు చీర ఎత్తి పెట్టుకున్న పెయింటింగ్ ఎందుకు వేశారు అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది. అందంగా వేయొచ్చు కదా ఛీఛీ ఇదేంటి అని అనుకుంటున్నారేమో…
Ads
నిజానికి మసూచి మహమ్మారి ఇండియాలో వ్యాపించి ఉన్న సమయమది. 19వ శతాబ్ద కాలంలో ఇండియాలో మసూచి మహమ్మారి వ్యాపించింది. అప్పుడు మైసూరు ని బ్రిటిష్ ఇండియా పాలిస్తోంది. మైసూరు రాజ్యాన్ని పాలిస్తున్న మార్క్ విల్కేస్ టీకా వేయించుకోవాలని తెలిపారు. బ్రిటిష్ వారి వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రాణాలకే ముప్పు అని అప్పట్లో రూమర్లు కూడా వచ్చాయి.
దీంతో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడ్డారు. అయితే మైసూర్ యువరాజుకి ఈ పై ఫోటోలో కుడివైపున ఉన్న దేవజమణి యువరాణితో వివాహం నిశ్చయమైంది. ఆమె రాజు కి కాబోయే భార్య. అప్పుడు వ్యాక్సిన్ వేయించుకుని పెయింటింగ్ వేయించి.. అందర్నీ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు రాజు. ఇలా ఆమె చీరని ఎత్తి పెట్టి టీకా వేయించుకున్నా అని.. మీరు కూడా వేయించుకోవాలని ఆమె సమాచారం ఇచ్చారు. అందుకోసమే ఈ పెయింటింగ్ లో ఆ అమ్మాయి చీర ఎత్తి పట్టుకుని వుంది.