Ads
తరచూ స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోతూ ఉంటాయి స్టవ్ మీద పాలు పెట్టి పాలు పొంగిపోతాయేమో అని అప్పటి వరకు అక్కడే ఉంటాము. ఇంకా టైం పడుతుందిలే అని ఇలా వెళ్లి అలా వచ్చే సరికి స్టవ్ మీద పాలు పొంగిపోతూ ఉంటాయి. సర్వ సాధారణంగా ఇది అందరి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా..?
తరచూ స్టవ్ మీద పాలు పొంగిపోతూ ఉంటాయా..? నిజంగా పాలు వృధా అయిపోతే చాలా బాధగా ఉంటుంది. ఆ పాలు ఎవరికీ కాకుండా పోతాయి.
మీరు కూడా మీ ఇంట్లో పాలని వృధా చేయకుండా ఉండాలని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి ఈ చిన్న చిట్కా ని మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా స్టవ్ మీద పాలు పొంగిపోవు. పాలు కూడా వేస్ట్ అవ్వవు పైగా తర్వాత పొయ్యి ని కూడా తుడుచుకోక్కర్లేదు. పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈసారి ఒక చిన్న చెక్క స్పూన్ తీసి గిన్నె లోపల నిటారుగా పెట్టండి. ఇలా చేస్తే పాలు బయటికి రావు కనుక ఈసారి మీరు పాలని స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ చిన్న టిప్ ని పాటించండి అప్పుడు పాలు పొంగిపోకుండా ఉంటాయి.
Ads
పాలని కాచుతున్నప్పుడు కింద మంట పెట్టడం వలన ఒక పొర మాదిరి ఆవిరి పైకి వస్తూ ఉంటుంది. అయితే ఆ ఆవిరి చెక్క స్పూన్ ని తాకగానే పగులుతుంది. చెక్క తొందరగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది దానితో పాలు త్వరగా పొంగు రావు. పాలు అక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. కానీ పైకి రావు. పాలు వృధా కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ని ఫాలో అవ్వండి ఇలా చేయడం వలన పాలు బయటికి రావు.. వృధా కావు.. పైగా మీరు మళ్ళీ పొయ్యి కడుక్కోక్కర్లేదు. శ్రమా ఉండదు.