టాలీవుడ్ లో అందరి కంటే ధనవంతుడైన ఈ హీరో ఎవరో తెలుసా..? ఆస్తుల విలువ ఎంతంటే..?

Ads

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోలు ఎందరో వస్తున్నప్పటికీ పాత హీరోల క్రేజ్ ఇంకా తగ్గలేదు. చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున ఇలా ఆరుపదులు వయసు దాటిన అందగాళ్ళు ఇప్పటికి హీరోలుగా కొనసాగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. మరోపక్క సినీ ఇండస్ట్రీ విస్తరిస్తున్న కొద్ది టాలీవుడ్ లోని హీరోలు తమ ప్రతిభను దేశ విదేశాలకు చాటి చెబుతున్నారు. వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించడంతో పాటు తమ రెమ్యునరేషన్ ని కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమాకి సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లోని అందరి హీరోలలోకి అత్యంత ధనవంతుడు ఎవరు అంటే…కింగ్ నాగార్జున అని చెప్పవచ్చు. అక్కినేని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున కేవలం ఒక యాక్టర్ గానే కాక పారిశ్రామికవేత్తగా, నిర్మాతగా, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ తన కెరీర్ ను ఎంతో సక్సెస్ఫుల్ గా నిర్మించుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తితో కలిపి నాగార్జున ప్రస్తుతం ఆస్తి విలువ సుమారు 3000 కోట్లు.

Ads

ఇక రెండవ స్థానంలో ఉన్న నెక్స్ట్ స్టార్ హీరో చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన కెరీర్ ను స్టార్ట్ చేసి స్వశక్తితో పైకి ఎదిగిన చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సృష్టించారు. చిరంజీవి ఆస్తి విలువ సుమారు 1,650 కోట్లు. ఇక తర్వాత స్థానం పవర్ స్టార్ రామ్ చరణ్ దే. చిరుత మూవీ తో సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ హీరో ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. చెర్రీ టోటల్ ఆస్తి విలువ 1370 కోట్లు. ఇక చరణ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ప్రభాస్ , బాల కృష్ణ,మహేష్ బాబు ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి ప్రముఖ నటులది.

Previous articleరివ్యూ : పరువు..! సుస్మిత కొణిదల నిర్మించిన ఈ సిరీస్ ఆకట్టుకుందా..?
Next articleపెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇవన్నీ అడుగుతున్నారా..? ఇందుకు కారణం ఏంటి..?