Ads
అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం తండేల్ .ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్ దీన్ని నిర్మిస్తుంది.
ఈ చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుండి కూడా ఆడియన్స్ అట్రాక్షన్ గ్రాబ్ చేసింది. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా శ్యామ్ దత్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.
శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా ఈ సినిమాని ధరకేకిస్తున్నారు. పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్లి అక్కడ వాళ్ల చేతికి చిక్కి పాకిస్తాన్ జైల్లో మగ్గిన మత్స్యకారుల నిజజీవితం ఆధారంగా సీన్లు రూపొందించారు. అయితే ఈ సినిమాకి అత్యంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా నిర్మాతలు తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునే విజువల్స్ తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సూపర్ గా ఉంది టీజర్.
Ads
నాగచైతన్య నటన సాయి పల్లవి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ టీజర్ తో సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసే విధంగా టీజర్ ఉంది. అయితే టీజర్ కి అంతా పాజిటివ్ గానే ఉన్నా కూడా ఒకటే ఒకటి మైనస్ గా మారింది.అదే నాగచైతన్య శ్రీకాకుళం స్లాంగ్. శ్రీకాకుళం స్లాంగ్ నాగచైతన్య కి అంతగా సూట్ కాలేదు. డైలాగ్ డెలివరీలో అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టీజర్ మాత్రమే విడుదల చేశారు కాబట్టి సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది కాబట్టి నాగ చైతన్య శ్రీకాకుళం ఇంకా మార్చుకుంటే బాగుంటుందని నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.
watch video :