ఎన్టీఆర్ “దేవర” వీడియోలో ఈ 2 విషయాలు మైనస్ అయ్యాయా..? ఆ ఫ్లాప్ సినిమా గుర్తొచ్చింది ఏంటి..?

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా దేవర సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తున్న కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం చేస్తున్నారు.

యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రముఖ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తరికెక్కుతున్న ఈ సినిమా లో విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.

minus points in devara glimpse video

Ads

అయితే ఈరోజు విడుదలైన టీజర్ ని ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా యాక్షన్ తో ఈ టీజర్ నింపేశారు. అనిరుధ్ పాడిన ఇంగ్లీష్ పాటతో ఈ టీజర్ మొదలవుతుంది. సముద్రంలో పోరాటాలు… ఒక వింత మనుషులతో ఎన్టీఆర్ చేసే ఫైట్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే దేవర టీజర్ లో వచ్చిన ఆఖరి డైలాగ్ ఆచార్య సినిమాలో పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ నన్ను ఆచార్య అని పిలుస్తారు అన్న డైలాగ్ ను పోలి ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

minus points in devara glimpse video

మరోపక్క అనిరుధ్ నుండి మంచి బిజిఎం అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఊహించినంత విధంగా బిజిఎం ఐతే లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునేది మాస్ బిజిఎం. అయితే ఇది ప్రస్తుతం టీజర్ మాత్రమే కాబట్టి ప్రేక్షకుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ట్రైలర్ లోను సినిమాలను మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాలని కోరుతున్నారు

Previous articleబెస్ట్ హీరో మాత్రమే కాదు… బెస్ట్ యాక్టర్ కూడా..! కానీ ఇప్పుడు ఏమైపోయారు..?
Next articleయష్ మొదలు మృణాల్ ఠాకూర్ వరకు.. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన 10 మంది నటులు వీళ్ళే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.