ఫ్యామిలీ స్టార్ క్లైమాక్స్ లో ఇంత పెద్ద లాజిక్ మిస్ అయ్యారు..? ఈ మిస్టేక్ గమనించారా..?

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల అయ్యింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. గోవర్ధన్ అనే ఒక మధ్య తరగతి మనిషి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సినిమా పాటలు సినిమా రిలీజ్ అయ్యే ముందు హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా విడుదల చేశారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ప్రకటించలేదు.

సినిమాలో కొన్ని సీన్స్ మీద బాగా కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరో తన కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తాడు కానీ, కొన్ని చోట్ల అదే లాజిక్ మిస్ అవుతాడు అన్నట్టు చూపించారు. సినిమా మొదటి నుండి చివరి వరకు హీరోకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం అన్నట్టే చూపించారు. హీరో తనకంటే తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అన్నట్టు సీన్స్ రూపొందించారు. తన కోసం కాదు. తన కుటుంబం కోసం హీరో బతుకుతాడు అన్నట్టు హీరో పాత్ర డిజైన్ చేశారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది.

Ads

అందుకు కారణం సినిమా చివరిలో హీరో, హీరోయిన్ పెళ్లి అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇది ఒక డ్రీమ్ లో వచ్చే పాట అని అనుకున్నారు. కానీ సినిమాలో చూసిన తర్వాత చివరిలో హీరోకి పెళ్లి జరుగుతుంటే చుట్టుపక్కల అతని కుటుంబం ఉండదు. హీరో జీవితంలో అది ఒక ముఖ్యమైన విషయం. అలాంటిది అవుతున్నప్పుడు కూడా హీరో చుట్టుపక్కల తన కుటుంబానికి చెందిన వారు ఉండరు. సినిమా మొత్తం చూపించిన మెసేజ్ ని ఒకే ఒక్క క్లైమాక్స్ తో మార్చేశారు. కుటుంబం అంటే అంత ఇష్టం ఉన్న వ్యక్తి కుటుంబం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు చూపించారు. దాంతో ఈ సీన్ చూసిన వాళ్ళు ఈ సీన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : 30 ఏళ్ల క్రితమే.. చిరంజీవి సినిమా టిక్కెట్ ధర ఎంత రేంజ్ కి వెళ్లిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్..!

Previous articleఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన టిఫిన్ ధరలు ఎంతో తెలుసా..? దోస ఖరీదు ఎంతంటే..?
Next articleఆఫీస్ లో మరొకరి మోజులో పడి భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు…కానీ ఆ రెండో షరతు చూసి భర్త.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.