మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో ఉన్న మిస్టేక్ ఏమిటో తెలుసా?

Ads

ఒకప్పటి రోజుల్లో అయితే సినిమాల్లో ఉన్న తప్పులను ఆడియెన్స్ ఎక్కువగా గుర్తించక పోయేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఎక్కువ అవడం, మరో వైపు ఓటిటీలో కూడా మూవీస్ అందుబాటులోకి రావడంతో చిన్న చిన్న తప్పులను కూడా ఆడియెన్స్ గుర్తిస్తున్నారు.

Ads

అక్కడితో ఆగకుండా ఆ మిస్టేక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్, షేర్ చేస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అలా ఇప్పటికే చాలా సినిమాలు ట్రోల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట వంతు వచ్చింది. ఆ మూవీ పై ట్రోల్స్ వస్తున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా గత ఏడాది మే 12న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా తొలి రోజే ప్లాప్ టాక్ ను వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు బాగా రాబట్టింది. మహేష్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్లు తెచ్చిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.112 కోట్ల దాకా షేర్ ను సాధించింది.
థియేటర్ రన్ ముగిసిన తరువాత ఓటీటీలో విడుదల అయ్యింది. అక్కడ కూడా సర్కారు వారి పాట సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ బ్యాంకుల మోసాల బ్యాక్డ్రాప్ తో తెరకెక్కింది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ మూవీలో ఒక యాక్షన్ సన్నివేశంలో డైరెక్టర్ లాజిక్ ను మిస్ అయ్యాడు.
అది ఏమిటంటే మహేష్ బాబు లారీతో వచ్చే సన్నివేశంలో ముందుగా ఇద్దరు రౌడీలను ఢీ కొట్టి, ముందుకు వెళ్తుంటాడు. అలా వెళ్ళినపుడు కూడా మొదట ఢీ కొట్టిన అదే రౌడీలను తిరిగి డీ కొడతాడు. అయితే ఈ చిన్న తప్పుని నెటిజన్లు గమనించి, లారి కిందపడిన రౌడీలు ఎలా వచ్చారు డైరెక్టర్ గారు అంటూ మూవీ డైరెక్టర్ పరశురామ్ ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్సయ్యారు అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Previous article‘ఓజి’ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleతారకరత్నను కాపాడడం కోసం శ్రమించిన హెల్త్ మినిస్టర్ కు కృతజ్ఞతలు చెప్తున్న అభిమానులు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.