ఈ ప్లేయర్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయా..? 8 సంవత్సరాల తరువాత ఐపీఎల్ లోకి..? ఎవరంటే..?

Ads

ఐపీఎల్ మినీ వేలం 2024 దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనున్న విషయం తెలిసిందే. అదే సమయంలో, మిచెల్ స్టార్క్, రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, డారిల్ మిచెల్ సహా 1166 మంది ప్లేయర్లు ఈ వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Ads

ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్ కి ఎక్కువ డిమాండ్ ఉందనే విషయం పై క్రికెట్‌ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2024 వేలం పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరీ ఏ ప్లేయర్ కు అధిక డిమాండ్ ఉందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌ 2024లో పాల్గొనాలనుకునే క్రికెటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 30న ముగిసిన విషయం తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఆక్షన్ కోసం మొత్తం 1166 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 830 మంది భారత ప్లేయర్లు కాగా, విదేశీ ప్లేయర్లు 336 మంది ఉన్నారు. వీరందరిలో ఏ ప్లేయర్ కు అధిక డిమాండ్ ఉందనే విషయం పై చర్చ జరుగుతోంది.
దీనికి సమాధానం మిచెల్ స్టార్క్‌, ఇతను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. మిచెల్ కు 2024 ఐపీఎల్ వేలంలో అధికంగా డిమాండ్ ఉండే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే 5 జట్లు, మిచెల్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిచెల్ వేలంలోకి వస్తే అతనికోసం ఫ్రాంచైజీలు పోటీపడటం తప్పనిసరిగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు మిచెల ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి మిచెల్ స్టార్క్‌ కేవలం 2 సీజన్లలో మాత్రమే ఆడాడు. చివరి సరిగా 2015లో జరిగిన ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరుపున ఆడారు. రెండు సార్లు కూడా రాయల్ ఛాలెంజర్స్ కే ఆడిన మిచెల్ స్టార్క్‌, 27 మ్యాచ్‌లు ఆడగా, 34 వికెట్లు తీశాడు. 2015 తర్వాత ఐపీఎల్‌లో పాల్గొనలేదు. ఎనిమిదేళ్ళ తరువాత ఐపీఎల్ వేలంలోకి వచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ ను ఏ జట్టు దక్కించుకుంటుందో చూడాలి.

Also Read: IPL 2024: ఈసారి IPL లో చేయబోతున్న భారీ మార్పులు ఇవే..!

Previous articleరీమేక్ కాదు అన్నారు..! కానీ చూస్తే అలాగే ఉంది కదా..?
Next articleసూపర్ హిట్ సినిమాలలో మంచి పాత్రలను రిజెక్ట్ చేసిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.