Ads
2023 వన్డే ప్రపంచ కప్ లో టీం ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన షమీ తర్వాత ఆడిన అన్ని మ్యాచుల్లో తన క్లాస్ పెర్ఫార్మన్స్ ఏంటో చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టి ఫైనల్ కి చేర్చాడు. వరల్డ్ కప్ లో అత్యధికంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు షమీ. ఇప్పటివరకు వరల్డ్ కప్ చరిత్రలో ఈ మైలురాయిని గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, స్టార్క్, లసిత్ మలింగ, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో షమీ కూడా చేరిపోయాడు. మొదటి నాలుగు మ్యాచులు కూడా ఆడుంటే షమీ ఇంకెన్ని వికెట్స్ తీసేవాడో.?
ఇది ఇలా ఉంటె…షమీ ఆట చూసి సెమీ ఫైనల్ లో ఇండియాని గెలిపించడంతో అతనికి గుడి కట్టినా తప్పులేదు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే షమీ గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు. తన భార్యతో విడాకుల దగ్గర నుండి ఎదుర్కొన్న అవమానాలు అన్నీ అందరికీ గుర్తుఉంటాయి. అయితే షమీ మాజీ భార్య షమీ ప్రదర్శన పైన తన స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఒక ఛానల్ ప్రయత్నం చేసింది.
Ads
అయితే ఆవిడ నుండి ఊహించని స్పందన లభించింది. తన మాజీ భార్య హాసిన్ జహాన్ మాట్లాడుతూ తానేమి క్రికెటర్లకు అభిమానిని కాదని చెప్పుకొచ్చింది. మహమ్మద్ షమీ మంచిగా ఆడితే ఇండియన్ టీం లో కొనసాగుతాడని అభిప్రాయపడింది. అలా జరిగితే బాగా సంపాదించేందుకు వీలవుతుందని కుటుంబానికి కూడా అది మంచిదేగా అని చెప్పుకొచ్చింది.
2014లో వీరి పెళ్లి జరగగా 2015లో వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే 2018లో కట్నం సహ పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతనిపైన వేధింపులు కేసు పెట్టింది. 2018 నుండి ఇద్దరు వేరుగా ఉంటున్నారు. అయితే ఇటీవల గృహహింస కేసు కింద తీర్పునిచ్చిన కోల్ కత్తా కోర్టు ప్రతినెల హాసిన్ కు షమీ లక్ష 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది.
అయితే అభిమానులు మాత్రం షమీకు జరిగిన అన్యాయం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. తన భార్య కారణంగా కెరియర్ నాశనం అయ్యే స్థితి నుండి ఈ రోజు షమీ స్టార్ క్రికెటర్ గా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారు.
Here we go……
She said it…….. #MoreWicketsMoreAlimony @MdShami11 pic.twitter.com/vjuCZufXsJ— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 7, 2023