Ads
ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది. ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లోనూ గెలిచింది. ఇక వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలంటే ఇంకా రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలి.
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ కప్ చివరి అంకానికి వచ్చింది. కీలక సెమీ-ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. నేడు జరిగే మొదటి నాకౌట్ మ్యాచ్లో టీంఇండియా న్యూజిలాండ్ టో తలపడనుంది. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ కు సలహాలు ఇస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Ads
తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు ముంబై వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపు సాధించి, ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంటామని భారత జట్టు ధీమాగా ఉంది. వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా జట్టులో పెద్దగా లోపాలు అయితే కనిపించడం లేదు. కానీ మొహమ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్ తో ఆడిన మ్యాచ్ లో ఫీల్డింగ్ లో పేలవమైన ప్రదర్శన చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో 2 క్యాచ్ లను మిస్ చేశాడు.
అలాగే టీమిండియా ఆడిన ఆఖరి రెండు మ్యాచ్ ల్లో కూడా సిరాజ్ 3 క్యాచ్ లను మిస్ చేశాడు. జరగబోయే సెమీఫైనల్లో కూడా సిరాజ్ ఇలాంటి పేలవమైన ప్రదర్శన చేస్తే భారత జట్టు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారత జట్టులో ఒక్క సిరాజ్ ఫీల్డింగ్ లో ఇంప్రూవ్ కావలసివుంది. సెమీస్ లో ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. ఒక్క క్యాచ్ నేలపాలు చేసినా కూడా, భారీ తప్పిదం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
పాకిస్తాన్ స్పిన్నర్ ఒసామా వార్నర్ క్యాచ్ ను మిస్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత వార్నర్ సెంచరీ చేశాడు. 10 రన్స్ కు అవుట్ అవ్వాల్సిన వార్నర్, ఒసామా మిస్ చేసిన క్యాచ్ వల్ల 163 రన్స్ చేశాడు. అందువల్ల సెమీ ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ లలో ఫీల్డింగ్ చేసేసమయంలో సిరాజ్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: WORLD CUP 2023: ఇండియా vs న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ లో వర్షం పడితే ఏం జరగనుంది?