బావ కోసం వచ్చిన మోక్షజ్ఞ తేజ..! అసలు విషయం ఏంటంటే..?

Ads

ఈ వయసులో కూడా మంచి హిట్లు ఇస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. బాలకృష్ణ నట వారసుడి సినీ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి వచ్చే సంవత్సరం ఉండబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు బాలయ్య.

అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఆదిత్య 999 మ్యాక్స్ అవుతుందో లేదంటే మరొక సినిమానో తెలియాల్సి ఉంది. నందమూరి వారసుడు ఎంట్రీ 2024 లో జరుగుతుంది అని తెలుసుకున్న అభిమానులు ఆనంద పడుతున్నారు.

mokshagna teja

బాలయ్య లాగే మోక్షజ్ఞ కూడా ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు ప్రకటిస్తే బాగుంటుంది అంటూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సినిమా ఏదైనాప్పటికీ మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకి బాలయ్య చిన్న కూతురు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. అయితే నందమూరి నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇప్పటివరకు పొలిటికల్ వేదిక మీద ఎక్కడా కనిపించలేదు. అలాంటి మోక్షజ్ఞ తన బావ కోసం బావతో కాలు కదిపి యువగళం పాదయాత్రలో అడుగులు ముందుకు వేశాడు.

Ads

ఈ వీడియోలో లోకేష్, మోక్షజ్ఞతో పాటు లోకేష్ భార్య కొడుకు కూడా ఉండటంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అటు నందమూరి అభిమానులు ఇటు నారావారి అభిమానులు ఇద్దరు పండగ చేసుకుంటున్నారు. హీరో మెటీరియల్ తో ఉన్న మోక్షజ్ఞ బాలకృష్ణ నట వారసత్వాన్ని నిలబెట్టేలాగే కనిపిస్తున్నాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ ఉంటే బాగుంటుంది అంటూ తమ ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది బాలకృష్ణ, మోక్షజ్ఞ కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఉంటే బాగుంటుంది అని ఆశపడుతున్నారు. మరి మోక్షజ్ఞ కెరియర్ ని బాలకృష్ణ ఎలా ప్లాన్ చేశాడో, ఎవరి ద్వారా లాంచ్ చేయబోతున్నాడు తెలియాలంటే బాలకృష్ణ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే

Previous articleఅమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన “వ్యూహం” చూసారా..? ఎలా ఉందంటే..?
Next articleసైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఈ సినిమా చూసారా.? రెండో రోజునుండి స్క్రీన్స్ పెంచారు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.