Ads
సంపన్న కుటుంబాలలో లేదా సెలెబ్రెటీల కుటుంబాలలో జరిగే పెళ్ళిళ్ళు చాలా ఆడంబరంగా, అట్టహాసంగా జరుగుతూ తరచుగా వైరల్ అవుతుండడం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు ఎన్నో పెళ్ళిళ్ళు వైభవంగా జరిగాయి.
Ads
అయితే దేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఆ పెళ్లి ఎవరిదంటే కర్ణాటక మాజీ మినిస్టర్ గాలి జనార్దన రెడ్డి కుమార్తెది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గాలి జనార్దన రెడ్డి కూతురు బ్రాహ్మణి రెడ్డి పెళ్లి ఇండియాలో జరిగిన అత్యంత కాస్ట్లీ పెళ్ళిళ్ళలో ఒకటిగా నిలిచింది. బ్రాహ్మణి రెడ్డికి హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మెన్ విక్రమ్ కుమారుడు అయిన రాజీవ్ రెడ్డితో పెళ్లి కుదిరింది. వీరి పెళ్లి 20016 లో నవంబర్ 6న గ్రాండ్ గ జరిగింది. ఈ వివాహ వేడుకకు 500 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. దాదాపు యాబై వేల మంది అతిథులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రాహ్మణి రెడ్డి వివాహ వేడుకలు జరిగాయి.
ఈ పెళ్లిలో బ్రాహ్మణి రెడ్డి ధరించిన పెళ్లి చీర చాలా ఖరిదైనది. బంగారు దారాలతో అల్లిన రెడ్ కలర్ పెళ్లి దుస్తులు తయారుచేయబడ్డాయి. బ్రాహ్మణి రెడ్డి ధరించిన కంజీవరం చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన నీతా లుల్లా డిజైన్ చేశారు. ఈ చీర ఖరీదు 17 కోట్ల రూపాయలు. ఈ పెళ్లి సంప్రదాయం మరియు విలాసవంతంగా జరిగింది. పెళ్లి కూతురు ధరించిన ఆభరణాలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాయి. ఇక బ్రాహ్మణి రెడ్డి ధరించిన డైమండ్ చోకర్ నెక్లెస్ హైలైట్ గా నిలిచింది. ఈ నెక్లెస్ ధర 25 కోట్ల రూపాయలు. ఆమె వేసుకున్న మిగిలిన ఆభరణాల విలువ 90 కోట్ల రూపాయలు.
వివాహ వేదికను విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపిలా రూపొందించారు. శ్రీ కృష్ణదేవరాయల రాజభవనం, మహానవమి దిబ్బ, లోటస్ మహల్, విజయ విఠల ఆలయ నమూనా వలె తీర్చిదిద్దారు. వేదిక వద్ద సుమారు నలబై రథాలు సిద్ధం చేశారు. ఈ పెళ్ళికి హాజరు అయిన అతిథులకు జనార్ధన రెడ్డి అత్యధిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఉన్న 5, 3 స్టార్ హోటల్స్ లో 1,500 రూమ్స్ ను ఏర్పాటుచేశారు. ఈ వేడుకలలో పాల్గొనడానికి వచ్చేవారిని తీసుకురావడానికి రెండు వేల ట్యాక్సీలు, 15 హెలికాప్టర్లను రెడీ చేశారు. ఈ వేడుకలో 16 టేస్టీ వంటకాలను అతిథులకు వడ్డించారు.
Also Read: ఏంటి ఈ హల్వా సెరిమొనీ..? దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి..?