అక్టోబర్ సర్వే ప్రకారం టాప్ 10 హీరోయిన్లు వీరే…పొజిషన్లు అన్ని మారిపోయాయిగా.?

Ads

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈ హీరోయిన్లలో ఎవరు టాప్ అంటే, ఎవరి  ఫ్యాన్స్ వారి హీరోయినే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్తుంటారు. ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరనేది తేల్చింది.

ఆర్మాక్స్ మీడియా ఒక కన్సల్టింగ్ సంస్థ. వివిధ సినీ ఇండస్ట్రీలలో మోస్ట్ పాపులర్ నటీనటులు ఎవరు  అనే విషయం గురించి ప్రతి నెలా సర్వే నిర్వహిస్తుంటుంది. అక్టోబర్ కు సంబంధించిన టాలీవుడ్ లో టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. సమంత: 

స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానంలో కొనసాగుతోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికకీ, సమంత టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ చికిత్స తీసుకుంటూ, వెకేషన్ లో ఉంది. ఆమె తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
2. కాజల్ అగర్వాల్: 
ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ ను కాజల్ అగర్వాల్ దక్కించుకుంది. ఆమె రీసెంట్ గా భగవంత్ కేసరి మూవీతో  ప్రేక్షకులను అలరించింది.
3. శ్రీలీల: 
యంగ్ హీరోయిన్ శ్రీలీల మూడవ ప్లేస్ దక్కించుకుంది. టాలీవుడ్ లో శ్రీలీల ప్రస్తుత టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమె చేతిలో 12 చిత్రాలు ఉన్నాయి. ఇటీవల స్కంద, భగవంత్ కేసరి చిత్రాలతో అలరించింది.
4. అనుష్క శెట్టి: 
అనుష్క శెట్టి ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది. రీసెంట్ గా ఆమె ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
5. సాయి పల్లవి:
లేడి పవర్ స్టార్ గా పేరుగాంచిన సాయి పల్లవి ఐదవ స్థానంలో ఉంది. విరాట పర్వం తరువాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు.
6. రష్మిక మందన్నా:

Ads

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 6వ స్థానంలో నిలిచింది. ఆమె ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
7. కీర్తి సురేష్:
ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ 7వ ప్లేస్ లో నిలిచింది. భోళా శంకర్ చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.
8. తమన్నా బాటియా:
తమన్నా ఈ లిస్ట్ లో 8వ స్థానంలో నిలిచింది. ఆమె జైలర్, బోళా శంకర్ చిత్రాలతో ఆడియెన్స్ ని అలరించింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 9. పూజా హెగ్డే: 
పూజా హెగ్డే 9వ ప్లేస్ లో నిలిచింది. ఈ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం తెలుగు చిత్రాలు లేవు. అయినా ఆమె  తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
10. అనుపమ పరమేశ్వరన్: 
ఈ లిస్ట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది మూడు సినిమాలతో అలరించిన అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ లో నటిస్తోంది.
Also Read: గుర్తుపట్టకుండా మారిన “ప్రభాస్” హీరోయిన్.. వైరల్ గా మారిన లేటెస్ట్ ఫోటో..!

 

Previous articleశ్రేయస్ అయ్యర్, చాహల్ భార్య మధ్య సంబంధం ఏంటి.. పదేపదే ఆమెను ఎందుకు చూపిస్తున్నారు?
Next articleవిడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. ఎందులో చూడచ్చు అంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.