Ads
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎక్కువగా చూడరు. కానీ డిజిటల్ రిలీజ్ అయ్యాక చాలా మంది చూస్తారు. అలా ఒక సినిమా ఓటీటీలోకి వచ్చాక చాలా మంది చూశారు. చూసి సినిమాని అభినందించారు. ఇది ఒరిజినల్ భాషలో చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని చూశారు. తమిళ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలో మాత్రం నటించలేదు. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా రోజుల వరకు శింబుకి సరైన హిట్ లేదు. ఈ సినిమాతో ఒక మంచి హిట్ శింబుకి లభించింది. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, అబ్దుల్ ఖాలిక్ (సింబు) ఒక ఎన్నారై. ధనుష్కోడి (ఎస్ జె సూర్య) ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. వీళ్ళిద్దరికీ జరిగే కథ ఈ సినిమా. సినిమా గురించి ఏదైనా కొంచెం మాట్లాడినా కూడా సినిమాకి సంబంధించిన స్టోరీ బయటికి వచ్చేస్తుంది. అందుకే కథ గురించి ఎక్కువగా తెలుసుకోకుండా సినిమా చూడటమే బాగుంటుంది.
Ads
టైం లూప్ అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడుస్తుంది. ఈ కాన్సెప్ట్ ని చాలా తక్కువ సినిమాల్లో బాగా చూపించారు. అందులో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి హైలైట్ అయింది మాత్రం ఎస్ జె సూర్య. తెలుగులో కూడా ఎస్ జె సూర్య తన డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. హీరో ఎంట్రీ కి థియేటర్లలో ఎంత అల్లరి అయితే చేశారో, ఎస్ జె సూర్య పాత్రకి కూడా అంత హంగామా చేశారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది.
సినిమా ఇంటర్వెల్ సినిమా మొత్తానికి చాలా పెద్ద హైలైట్ గా నిలిచింది. 2021 లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని తెలుగులో రిపీట్ పేరుతో విడుదల చేస్తారు అని చెప్పారు. కానీ సోనీ లివ్ లో ఈ సినిమా మానాడు పేరుతోనే ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించారు. ప్రేమ్ జీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ఇష్టపడేవారు ఈ సినిమాని కూడా తప్పకుండా ఇష్టపడతారు. అందుకే ఈ సినిమాకి అంత మంచి కామెంట్స్ వచ్చాయి.