Ads
నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఇవాళ విడుదల అయ్యింది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సినిమా మొత్తం కూడా చాలా ఎమోషనల్ గా ఉంది అని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి సినిమా హిట్ టాక్ తో నడుస్తోంది.
కథ విషయానికి వస్తే పెద్ద కొత్తగా లేకపోయినా కూడా హ్యాండిల్ చేసే విధానం బాగుండడంతో ప్రేక్షకులకు ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. నానికి ఇలాంటి ఎమోషనల్ సినిమాలు, ఎమోషనల్ పాత్రలు అనేది కొట్టిన పిండి లాంటిది. సాధారణంగానే ఏ ఎమోషన్ అయినా కూడా సహజంగా పలికించే అంత ప్రతిభ ఉన్న నటుడు నాని.
ఇప్పుడు ఈ పాత్ర తనకి చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సినిమా చూసిన తర్వాత విరాట్ పాత్రలో నానిని తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం. అంత బాగా నటించారు. మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. అయితే ఈ సంవత్సరం ఇలాంటి కథ ఉన్న సినిమా వచ్చింది. దాంతో ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా హాయ్ నాన్న సినిమా చూసి ఇదేంటి ఆ సినిమా లాగా ఉంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు డాడా.
Ads
తమిళ్ లో ఈ సినిమా రూపొందింది. చిన్న బడ్జెట్ తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో హాయ్ నాన్న సినిమాలో లాగానే హీరోయిన్ తల్లి అవ్వడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హీరోయిన్ బిడ్డకు దూరం అవ్వడం, దాంతో హీరో తన కొడుకు బాధ్యతలు తీసుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ మళ్లీ తన బిడ్డ, హీరోలని కలవడం ఇదంతా సినిమా స్టోరీ లైన్. దాదాపు హాయ్ నాన్న సినిమా స్టోరీ లైన్ కూడా ఇలాగే ఉంది. డాడా సినిమాలో కూడా ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చాలా మందిని కంటతడి పెట్టిస్తుంది. హాయ్ నాన్న సినిమా దీనికి మరీ దగ్గరగా ఉంది అని చెప్పలేం కానీ, స్టోరీ లైన్ మాత్రం దగ్గరగా ఉంది. కాకపోతే డాడా సినిమాలో వారికి పెళ్లి అవ్వదు, ఇక్కడ వీళ్లు పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా కొన్ని మార్పులు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇటీవల పోస్టర్ కూడా విడుదల చేశారు.
పాపా పేరుతో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు సమాచారం. మరి ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత హాయ్ నాన్న సినిమాతో పోలికలు వస్తాయి ఏమో. అంతే కాకుండా హాయ్ నాన్న సినిమాని తమిళ్ లో చూసిన వాళ్ళు ఈ సినిమాతో కూడా పోలుస్తారు ఏమో. ప్రస్తుతం అయితే హాయ్ నాన్న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది. మిగిలిన భాషల్లో కూడా విడుదల చేస్తారు.
ALSO READ : “ఇడియట్” నుండి… “సరిలేరు నీకెవ్వరు” వరకు… ప్రేమ పేరుతో “అభ్యంతరకరమైన సీన్స్” ఉన్న 8 సినిమాలు..!