సినిమా వచ్చి ఆరేళ్లు అయ్యింది… ఇంకా టెలికాస్ట్ చేయలేదు..! ఏం జరిగింది..?

Ads

ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వడం ఒక ఎత్తు. అది తర్వాత టీవీలో టెలికాస్ట్ అవ్వడం కూడా మరొక ఎత్తు. కొన్ని సినిమాలు విడుదల అయిన కొన్నాళ్లకే టీవీలో వచ్చేస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం సంవత్సరాలు అయినా కూడా రావు. “ఈ సినిమా టీవీలో ఇంకా రాలేదు ఏంటి?” అని అందరూ అనుకుంటూ ఉంటారు. థియేటర్లలో సినిమా వచ్చినప్పుడు అందరూ చూడరు. కొంత మంది టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అని అనుకునే వారు కూడా ఉంటారు. ఓటీటీ కూడా అందరికీ అందుబాటులో ఉండదు. టీవీ మాత్రమే వారికి కాలక్షేపం. కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా టెలికాస్ట్ అవ్వవు.

movie which did not telecasted on tv

Ads

అలాంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వచ్చి ఆరు సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు టీవీలో రాలేదు. ఈ నగరానికి ఏమైంది. సోషల్ మీడియాలో టెంప్లేట్స్ లాగా, డైలాగ్స్ తో చాలా ఫేమస్ అయిన సినిమా ఇది. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా కూడా సినిమా మాత్రం కల్ట్ క్లాసిక్ సినిమా లాగా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఇప్పటి వరకు ఈ సినిమా టీవీలో రాలేదు. చాలా మంది తమకి బోర్ కొట్టినప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఈ సినిమా చూసి మైండ్ ఛార్జ్ చేసుకుంటారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ఇది.

మరి ఇప్పటి వరకు ఇది టీవీలో ఎందుకు రాలేదు అనే విషయం ఎవరికీ తెలియదు. సినిమా అయితే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. చాలా షోస్ లో ఈ డైలాగ్స్ వాడుతారు. సినిమా మీద ఎన్నో టెంప్లేట్స్ కూడా ఉంటాయి. అలాంటి సినిమా టీవీలో ఇంకా ఎందుకు రాలేదు అనేది మాత్రం తెలియని విషయం. ఇది ఒక్కటే కాదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ టీవీలో ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అని ఎదురు చూస్తున్నారు.

Previous article“నాగ్ అశ్విన్” నటించిన 3 సినిమాలు ఏవో తెలుసా..? డైరెక్టర్లు ఎవరంటే..?
Next articleసినీ నటులు 30 దాటాక మాత్రమే పెళ్లి ఎందుకు చేసుకుంటారు..? కారణాలు ఇవేనా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.