ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఇదే..! ఈ సినిమా చూశారా..?

Ads

ఇండియన్ సినిమా చరిత్రలో మలయాళీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. వారి సినిమాలో చాలా సహజత్వంగా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కొన్ని సమస్యల పైన వారు సినిమాలో లేవనెత్తే అంశాలు ఔరా అనిపించక మానవు.

మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తరికెక్కించిన చిత్రం జనగణమన. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అభినందించక మానరు. అసల ఈ సినిమాలో ఏముంది అనుకుంటున్నారా…

movie which got huge appreciation

యూనివర్సిటీ లెక్చరర్ అయిన సభా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి, బాడీని కాల్చి చంపేశారంటూ మీడియాలో నేషనల్ న్యూస్ అవుతుంది. ఇక యూనివర్సిటీ స్టూడెంట్స్ తమ టీచర్‌కు న్యాయం జరగాలని రోడ్డు మీదకు ఎక్కుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాడుతుంది. ఇక ఈ కేసును ఛేదించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) రంగంలోకి దిగుతాడు. ఓ నలుగురు దుండగలను పట్టుకుంటాడు. సమాజం నుండి వారిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తుంది. పై నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏసీపీ కూడా ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేస్తాడు.

movie which got huge appreciation

దీనిపై మానవ హక్కుల కమీషన్ ఆగ్రహిస్తుంది. న్యాయ స్థానంలో కనీసం ఆ నిందితులను ప్రవేశ పెట్టకుండా అలా ఎలా చేస్తారంటూ న్యాయవాది అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కేసు వాదిస్తాడు. ఏసీపీ సజ్జన్ చేసిన ఎన్ కౌంటర్‌కు వ్యతిరేకంగా నిలబడతాడు అరవింద్. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఆ ఎన్ కౌంటర్ ఎందుకు చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? ఆమె చావుకు గల కారణం ఏంటి? దాని వెనుకున్నది ఎవరు? అనే విషయాలు ఎలా బయటకు వచ్చాయి? అనేదే కథ.

movie which got huge appreciation
జన గణ మన సినిమా విషయానికి వస్తే సినిమాలో కనిపించే పాత్రలు ఎన్ని ఉన్నా కూడా మన దృష్టి మాత్రం ఫస్టా హాఫ్‌లో ఏసీపీ సజ్జన్ మీదే ఉంటుంది. ఇక ద్వితీయార్థం మొత్తం కూడా పృథ్వీరాజ్ ప్రేక్షకులను కట్టిపాడేస్తాడు. నటనలో ఈ ఇద్దరికీ వంక పెట్టలేం. సభా మరియం పాత్రలో మమతా మోహన్ దాస్ చక్కగా నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. జన గణ మన సినిమాతో ఏకంగా వ్యవస్థనే ప్రశ్నించేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు మనకు దిశ సంఘటనే గుర్తుకు వస్తుంటుంది.

movie which got huge appreciation

సమాజంలోని విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇలా అన్నింటి మీద ప్రశ్నలు కురిపించాడు. వాటి ఉనికి మీదే అనుమానం కలిగించాడు. సమాజంలో ఇవి ఏ స్థితిలో ఉన్నాయో చూపించాడు. వర్ణ వివక్ష, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపించాడు. ఓ రైతు బిడ్డ రైతుగానే మిగిలిపోవాలా? ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లడం నేరమా? సమాజం వెళ్లనివ్వదా? అని సూటిగా ప్రశ్నించాడు. విద్యా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూపించారు. విద్యార్థులను రాజకీయాలకు ఎలా వాడుకుంటారో కూడా చూపించారు.

Ads

movie which got huge appreciation

ఇక మీడియా చేసే రాద్దాంతం మీద ఘాటుగా చురకలు అంటించాడు. ఏ వార్తకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ వార్తను సెన్సేషన్ చేయాలి,నేషన్ మూడ్‌ను ఎలా కంట్రోల్ చేయాలి అన్నీ కూడా మీడియానే చేస్తోందని సెటైర్లు వేశారు. మనం నిజాలను మరిచిపోయి మీడియా చెప్పిందే నిజమని భ్రమపడేలా చేస్తోందని మండిపడ్డారు. అందుకు గానూ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ ఉదంతాన్ని ఉద్ఘాటించాడు. ఒకప్పుడు మీడియా ఆయనను దేశద్రోహి అని రాతలు రాసిందని, కానీ చివరకు న్యాయస్థానం మాత్రం ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసిందని, ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిందని చెప్పుకొచ్చాడు.

movie which got huge appreciation

ఇక పోలీస్ వ్యవస్థ మీద కూడా చురకలు అంటించారు.ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. అసలు విచారణ చేసిన పద్దతి ఏంటి? వారే దోషులు అని పోలీసులు ఎలా నిర్దారించారు?అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దిశ లాంటి ఓ ఘటన జరిగితే సమాజం మొత్తం కూడా నిందితులను చంపేయాలని,ఎన్ కౌంటర్ చేసేయాలంటూ ఆగ్రహ జ్వాలతో రగలిపోతుంటుంది. ఈ సినిమాలోనూ అలానే జరుగుతుంది. వారిని ఎన్ కౌంటర్ చేసేస్తారు. కానీ అసలు వాళ్లు ఆ తప్పు చేశారా? లేదా? అని ఏ ఒక్కరూ ఆలోచించరు.

movie which got huge appreciation

చివరకు ఇదే విషయాన్ని లాయర్‌గా అరవింద్ ప్రశ్నిస్తే.. వాళ్లను చూస్తేనే తెలుస్తుంది కదా? అని జడ్జ్ నోరు జారతాడు. రంగు, రూపం, వేషధారణ బట్టి కూడా చేస్తారా? అంటూ ఈ సమాజానికి కనువిప్పు కలిగేలా ప్రశ్నలు సంధించాడు. అసలు రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారు ఓట్ల రాజకీయం ఎలా ఉంటుందో చూపించాడు. ద్వితీయార్థం అంతా కూడా కోర్టులో వాదనలు, ప్రతివాదనలతోనే సరిపోతుంది.

movie which got huge appreciation

లాయర్ అరవింద్ ఇలా వాదిస్తున్నాడేంటి అని మొదట్లో అనిపించినా.. ముందుకు వెళ్తున్నా కొద్ది అసలు కథ బయటకు వస్తుంది. ఇక అలా పోతూ ఉంటే ట్విస్టులకు కొదవే ఉండదు. మొత్తానికి ఇది అంతం కాదు ఆరంభం అంటూ చివర్లో వదిలిన క్లూతో సీక్వెల్ మీద అంచనాలు పెంచేశాడు. జన గణ మన సినిమా అందరికీ కనువిప్పుగా ఉంటుంది.

movie which got huge appreciation

చుట్టూ ఉన్న సమాజంలో నిజానికి చోటు ఎంత ఉంది,అబద్దానికి బలం ఎంత ఉంది? అనేది చూపించాడు. న్యాయ వ్యవస్థ మీద జనాలకు ఉన్న నమ్మకం ఎంత అనేది, విద్యార్థి లోకాన్ని అన్నీ బాగా చూపించాడు దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ. ఈ కథను రాసింది షరీస్ మహమ్మద్. జేక్స్ బిజోయ్ సంగీతం బాగుంది. సినిమా ముగిసిన తరువాత పృథ్వీ రాజ్ పాత్ర సంధించిన ప్రశ్నలు మాత్రం మెదడుని తొలిచేస్తూనే ఉంటాయి.ఇన్ని విశేషాలు ఉన్న సినిమాని ఒకసారి కచ్చితంగా చూడాల్సిందే

Previous articleశ్రీకృష్ణుడు కి 16వేల మంది భార్యలు ఎందుకు ఉండేవారు..? మీకు తెలుసా..?
Next articleవిదేశాల్లో బ్యాన్ చేసినా… మన దేశంలో ఈ 13 ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.