Ads
కొన్ని సినిమాలు కథకి ఫేమస్ అయితే, కొన్ని సినిమాలు అందులో నటించిన వారి వల్ల ఫేమస్ అవుతాయి, కొన్ని సినిమాలు డైలాగ్స్ వల్ల ఫేమస్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. అవి పాటల వల్ల ఫేమస్ అవుతాయి. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సినిమా విడుదల అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఆ పాటలు ఇప్పటికి కూడా వింటూ ఉంటారు. వాటిలో డబ్బింగ్ సినిమాలు కూడా ఉంటాయి. ఒక సమయంలో హారిస్ జయరాజ్ అంటే తెలుగు వారికి ఎంతో అభిమానం ఉండేది.
హారిస్ జయరాజ్ ఎక్కువగా తమిళ్ సినిమాలకి మాత్రమే సంగీత దర్శకత్వం వహించేవారు. కానీ తెలుగులో ఆయనకి ఉన్న అభిమానులని దృష్టిలో పెట్టుకొని తెలుగు డబ్బింగ్ లో కూడా పాటల క్వాలిటీ మిస్ అవ్వకుండా చూసుకునేవారు. ఇప్పట్లో చాలా డబ్బింగ్ సినిమాల్లో పాటల క్వాలిటీ మారిపోతుంది. కానీ హారిస్ జయరాజ్, ఏఆర్ రెహమాన్ వంటి వాళ్ళు మాత్రం డబ్బింగ్ లో కూడా ఒరిజినల్ ఎంత క్వాలిటీగా ఉంటాయో, డబ్బింగ్ కూడా అంతే క్వాలిటీగా ఉండాలి అని అనుకుని పని చేస్తూ ఉంటారు. అందుకే వారికి ఇంత మంది అభిమానులు ఉన్నారు.
Ads
అలా హారిస్ జయరాజ్ పాటల ద్వారా ఫేమస్ అయిన సినిమా నీవల్లే నీవల్లే. ఈ సినిమా చాలా మందికి గుర్తుండి ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా మంది ఈ సినిమా పాటలు వింటారు. వినయ్ రాయ్, సదా, తనీషా ముఖర్జీ నటించిన ఈ సినిమాకి జీవా దర్శకత్వం వహించారు. సినిమా 2007 లో విడుదల అయ్యింది. అదే సంవత్సరం డైరెక్టర్ జీవా మరణించారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పట్లో అలాంటి కథ అసలు రాలేదు. తమిళ్ లో ఉన్నాలే ఉన్నాలే పేరుతో విడుదలైన ఈ సినిమాని తెలుగులో నీవల్లే నీవల్లే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
సినిమా పాటలు చాలా బాగుంటాయి. సినిమా కూడా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. యూట్యూబ్ లో తెలుగులోనే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సదా పాత్ర రాసిన విధానం చాలా బాగుంటుంది. అప్పట్లో సదా పాత్ర మీద, హీరో అంత బతిమలాడుతున్నా కూడా పట్టించుకోదు అని విమర్శలు వచ్చినా కూడా, ఇప్పుడు సదా పాత్ర అని ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారు. ఆమె చేసిన పనుల్లో అర్థం ఉంది అని అందరూ ఆమె పాత్రను సమర్థిస్తున్నారు. తాను ప్రేమించిన వ్యక్తి అలా ప్రవర్తిస్తే ఎవరైనా సదా స్పందించినట్టే స్పందిస్తారు అని అంటూ ఉంటారు.