Ads
తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న కథానాయకులలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన కెరీర్ మొదలు పెట్టిన ఏడాదిన్నరకే స్టార్ హీరోగా ఎదిగారు. చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి సినిమాలతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేశాడు.
Ads
అలా ఆయన స్టార్ హీరో అయ్యాడు. అంతేకాకుండా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉదయ్ కిరణ్ అప్పట్లో అమ్మాయిల కలల రాజకుమారుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా తన జీవితాన్ని తానే ముగించాడు. ఉదయ్ కిరణ్ మంచి నటుడు, హార్డ్ వర్కర్ అని పరిశ్రమలో ఆయన పరిచయం ఉన్నవారు చెబుతుంటారు. ఉదయ్ కిరణ్ ని మెగాస్టార్ చిరంజీవి తన అల్లుడిగా చేసుకోవాలి అని అనుకున్నారు. అయితే అది జరగలేదు. ఆ తరువాత ఆయన సినీ కెరీర్ డౌన్ అయ్యింది.
ఉదయ్ కిరణ్ ఎలాంటి సినీ నేపద్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఆయన ఎంత వేగంగా స్టార్ హీరో అయ్యాడో, అంతే వేగంగా కిందకి పడిపోయాడు. వరుసగా ఆయన సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో ఉదయ్ కిరణ్ మార్కెట్ కూడా పడిపోయింది. ఆ తరువాత వివాహం చేసుకున్నప్పటికి ఆయన ఆనందంగా జీవించలేకపోయాడని ఉదయ్ సోదరి ఒక సందర్భంలో తెలిపింది. చివరికి 2014లో జనవరి నెలలో ఎవ్వరూ అనుకోని విధంగా ఉదయ్ కిరణ్ ఉరేసుకుని మరణించాడు.ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ గురించి సీనియర్ నటుడు, ప్రొడ్యూసర్ మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కు మెగాస్టార్ చిరంజీవికి ఉన్న రిలేషన్ గురించి వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్నారని, అయితే ఆయనకు హైపర్ టెన్షన్ ఎక్కువ. విపరీతమైన బిపి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ కంట్రోల్ లో ఉండడు అని తెలిపారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరి సినిమా హిట్ అయిన వారికి ఫోన్ చేసి అభినందిస్తారని, అది ఆయనకు ముందు నుండి ఉన్న లక్షణం అని తెలిపారు.
ఈ క్రమంలోనే గతంలో ఉదయ్ కిరణ్ మంచి చిత్రాలు చేయడం, అవి హిట్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి తరచూగా ఉదయ్ ని అభినందించేవారని, అంతే కాకుండా ఉదయ్ కిరణ్ ను తన అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నారని మురళీ మోహన్ తెలిపారు. అప్పుడే దానికి సంబంధించిన ప్రకటన ఇచ్చారని, అలాగే తన కుమార్తెతో నిశ్చితార్థం కూడా చేశారని తెలిపారు.
కానీ ఆ తరువాత ఏమైందో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత అతని సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయని, ఆక్రమంలోనే ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని ముగించి ఉంటాడని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
Also Read: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో పాట’ వెనుక ఉన్న స్టోరిని చెప్పిన రాజమౌళి..!