Ads
అక్కినేని నాగచైతన్య.. నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొద్దిరోజులుగా సినిమాలు విషయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఇతను ప్రస్తుతం బాగా ట్రెండింగ్ గా ఉన్న వెబ్ సిరీస్ ని కూడా ట్రై చేస్తున్నాడు. ఆన్లైన్ ప్లాట్ఫారంలో తన సత్తా చాటుకోవడానికి దూత అనే సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
- వెబ్ సిరీస్: దూత
- నటీనటులు: నాగచైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్, పశుపతి, రోహిణి, తరుణ్ భాస్కర్ దాస్యం, రవీంద్ర విజయ్, తనికెళ్ల భరణి, అనీష్ కురువిల్లా, జయప్రకాశ్ తదితరులు
- డైరక్టర్: విక్రమ్ కే కుమార్
- నిర్మాతలు:శరత్ మరార్, విక్రమ్ కే కుమార్
- మ్యూజిక్: ఇషాన్ చాబ్రా
- రిలీజ్ డేట్: 01/12/2023
కథ:
సాగర్ వర్మ (నాగచైతన్య).. ఒక పత్రికా యజమానిగా ,యువ పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. తన సొంత పత్రికను ప్రారంభించిన రోజు నుంచి సాగర్ జీవితంలో ఊహించని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం మొదలవుతాయి. పత్రిక ప్రారంభించిన రోజు తన భార్యా పిల్లలతో కలిసి ఇంటికి వెళుతుంటాడు. భారీ వర్షంలో అనుకోకుండా పెట్రోల్ అయిపోవడంతో కారు రోడ్డు పై ఆగిపోతుంది.
అదే టైం కి లారీ వచ్చి సడన్ గా ఢీకొట్టడంతో అతని ఎంతో ఇష్టంగా పెంచుకున్నా పెంపుడు కుక్క చచ్చిపోతుంది. అది యాదృచ్ఛికమని భావిస్తున్న సమయంలో ఇన్సిడెంట్ కి ముందు రోజు పేపర్ లో వచ్చిన ఒక పజిల్ చదువుతుండగా తన పెంపుడు కుక్క చావుకు సంబంధించిన ప్రశ్నను చూసి అతను షాక్ అవుతాడు.
ఇలా అతని జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనల తాలూకు వివరాలు ముందుగానే వార్తాపత్రికల క్లిప్పింగుల్లో ఎలా వచ్చాయి? ఇది ఎవరన్నా కావాలని చేస్తున్నారా? దీని వెనుక ఎవరు ఉన్నారు? తన భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఇలా న్యూస్ పేపర్ పజిల్స్‌లో రావడం పై సాగర్ ఎలా స్పందించాడు? ఫైనల్ గా సాగర్ తన చుట్టూ జరుగుతున్న విషయాలను ఎలా చేదించాడు? తెలుసుకోవాలి అంటే తప్పకుండా దూత వెబ్ సిరీస్ ని చూడండి.
Ads
విశ్లేషణ:
మీడియా బ్యాక్ డ్రాప్, భవిష్యత్తు ముందే తెలిసే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ పాతది కానీ దాన్ని ప్రదర్శించిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచే విధంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సీన్ ఎంతో బ్యాలెన్స్ గా నెక్స్ట్ సీన్ కి లింక్ అయ్యే విధంగా పర్ఫెక్ట్ గా తీశారు. ఒక ఎపిసోడ్ నుంచి మరొక ఎపిసోడ్ కు అద్భుతమైన కనెక్టివిటీ మెయింటైన్ చేయడమే కాకుండా కంటెంట్ ఎక్కడ కన్ఫ్యూజింగ్ గా లేకుండా చూసుకున్నాడు డైరెక్టర్.
విక్రమ్ కే కుమార్ స్వయంగా రాసిన కథ, కథనాలతో ఈ వెబ్ సిరీస్ ను ఎంతో గ్రిప్టింగా తెరకెక్కించాడు. మొదటి ఎపిసోడ్ సిరీస్ పై ఆసక్తి కలిగించే విధంగా ఉంది. ట్విస్టులతో.. థ్రిల్లింగ్ అంశాలతో.. చివరి వరకు సస్పెన్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నాగచైతన్య అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఇది అతని కెరిర్ లోనే ఉత్తమమైన ప్రదర్శన అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్:
- స్టోరీ ముందుకు తీసుకువెళ్లిన విధానం ఆసక్తికరంగా ఉంది.
- స్టోరీ ఎక్కడ బోరింగ్ అనిపించదు.
- ఎపిసోడ్స్ మధ్య కనెక్టివిటీ బాగా మెయింటైన్ చేశారు.
- నాగచైతన్య యాక్టింగ్ ఈ సిరీస్ కి మరొక ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్:
- ఇందులో చెప్పడానికి పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు.. కానీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు
- మరింత క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
రేటింగ్:
3/5
చివరి మాట:
థ్రిల్లింగ్ స్టోరీలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఈ వెబ్ సిరీస్ తో వీకెండ్ అందరూ బాగా ఎంజాయ్ చేయవచ్చు.
watch trailer :
ALSO READ : హీరోయిన్ “రాధ”కి ఇన్ని వందల కోట్ల ఆస్తి ఉందా..? వ్యాపారాలు కుడా..?