Ads
Narasimha Naidu Vs Khushi: నటసింహాం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయుడు. ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యి, అన్ని సెంటర్ లలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక అదే సంవత్సరంలో విడుదలైన మరో సినిమా పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి.
Ads
అప్పటికే వరుసగా ఆరు హిట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఖుషితో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ మూవీ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ నే టర్న్ చేసింది. అప్పటి యూత్ ఈ సినిమాకి ఫిదా అయ్యారు. ఇక ఒకే ఏడాది 2001లోనే నరసింహానాయుడు, ఖుషి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసాయి. ఇప్పటికి ఈ రెండు మూవీస్ లో ఏ సినిమా బాక్సాఫీసు షేక్ చేసిందనే సందేహం ఫ్యాన్స్ లో ఉంది.ఎస్.జె సూర్య దర్శకత్వంలో పవన్ హీరోగా విడుదలైన సినిమా ఖుషి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ఇక బాలయ్య బి గోపాల్ దర్శకత్వంలో నటించిన మూవీ నరసింహనాయుడు. ఈ మూవీ మాస్ ఆడియన్స్ చేత థియేటర్స్ లో కేకలు పెట్టించింది. ఇక రెండు చిత్రాలకు సంగీతం అందించింది మెలోడి బ్రహ్మ మణిశర్మ. ఇక నరసింహనాయుడు, ఖుషి చిత్రాల్లోని సాంగ్స్ ఇప్పటికీ వింటూనే ఉన్నారు. మణిశర్మ సంగీతం అంతలా ఆకట్టుకుంది.ఇక కలెక్షన్ల పరంగా చూస్తే, నరసింహానాయుడు సినిమా 22 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్, నెల్లూరు,ఉత్తరాంధ్ర, గుంటూరు,ఈస్ట్ ,వెస్ట్ కర్ణాటక, ప్రాంతాల్లో ఖుషి కంటే కాస్త ఎక్కువ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి 21 కోట్ల షేర్ కలెక్ట్ రాబట్టింది. కృష్ణా ఏరియాలో, నైజాం, నరసింహానాయుడి కంటే పవన్ పై చేయి సాధించాడు. నరసింహానాయుడు సంక్రాంతికి విడుదల కాగా, మూడు నెలల గ్యాప్లో ఖుషి విడుదలైంది. ఇక అప్పట్లో కలెక్షన్స్ కంటే సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేది లెక్క ఉండేది. ఇండస్ట్రీ హిట్ అంటే సినిమా ఆడిన థియేటర్ల లెక్కను బట్టి చూసేవారు. సెంటర్స్ :
నరసింహానాయుడు: 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
ఖుషి : 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
కలెక్షన్స్
నరసింహానాయుడు : 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఖుషి: 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది