“మన సీరియల్స్ లో మార్పు వస్తే బాగుండును అని మీరు అభిప్రాయపడుతున్నారా ?” అనే ప్రశ్నకి… ఈ నెటిజన్ చెప్పిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు..!

Ads

భాషా భేదం లేకుండా ఏ ప్రాంతంలో అయినా కూడా తరతరాల నుండి నాటుకుపోయిన కొన్ని అలవాట్లలో సీరియల్స్ చూడడం అనే అలవాటు కూడా ఒకటి. సినిమాలు అంటే థియేటర్ కి వెళ్లి చూడాలి. లేదా మూడు గంటలు అలానే కూర్చోవాలి. ఇది చాలా మందితో అయ్యే పని కాదు.

సీరియల్ విషయంలో అలా ఉండదు. 30 నిమిషాల స్లాట్ లో 22 నిమిషాలు సీరియల్ వస్తుంది. మిగిలిన సమయంలో ప్రకటనలు వస్తాయి. సరిగ్గా ఒక ట్విస్ట్ చూపించే ముందు ప్రకటన ఇచ్చి, ఆ తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తితో ప్రేక్షకులని టీవీ స్క్రీన్ కి అతుక్కుపోయేలాగా సీరియల్స్ రూపొందిస్తారు.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

సాధారణంగా సీరియల్స్ లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. అది కొంత వరకు బాగానే ఉంటుంది కానీ ఇటీవల కొంత కాలం నుండి సీరియల్స్ అంటే ట్రోలింగ్ కి ఎక్కువగా గురి అవుతున్నాయి. దాంతో సీరియల్స్ లో ఏదైనా విషయం మారితే బాగుంటుందా అని కోరాలో ఒక వ్యక్తి ప్రశ్న వేయగా అందుకు వర్షిత రావు గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. “మన సీరియల్స్ లో మార్పు వస్తే బాగుండును అని మీరు అభిప్రాయపడుతున్నారా ? అది ఎలా ఉంటే బాగుండును అని మీ అభిప్రాయం ?” అనే ప్రశ్నకి వర్షిత రావు గారు ఇలా రాశారు. “భలే ప్రశ్న వేశారండి… సీరియల్స్ పైన నా అక్కసు వెళ్లగక్కే సమయం వచ్చింది. సంతోషం.”

“ముందుగా ఈ సీరియల్ కథానాయకుడు గారు అదే మన హీరో గారు సూట్ వేసుకుని ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు… పైగా వందల కోట్లకు అధిపతి. ఈ లాజిక్ ని ఎలా అర్థం చేసుకోవాలో నా బఠాని సైజు బుర్రకి అర్థం కావట్లేదు అండి. ఇంక మా కథానాయిక గారు… ఈవిడ ఇంటి బరువు భాద్యతని మొస్తుంది. ఇంట్లో లేడీ విలన్ల ప్లాన్లు తిప్పి కొడుతోంది. కొన్ని సీరియళ్లు లో ఈవిడకి చదువు రాదు కానీ బోర్డ్ మీటింగ్స్ చక్క పెడుతుంది. కొన్ని సీరియళ్లు లో అయితే ఈవిడ అపర మేధావి…ఏ ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు బిసినెస్ మీటింగ్స్ విజయవంతం గా చేస్తుంది.”

“కొన్ని సీరియళ్లు లో అయితే ఈవిడ అవమానాలను భరిస్తూ… ఆకలి దప్పులను ఓర్చుకుంటూ…అక్కడే ఉంటుంది… పైగా ఈవిడ స్టేట్ టాపర్… మహిళా హక్కులు…మహిళా అభ్యున్నతి ఇంత చదివిన ఈవిడకి తెలియవు. ఇంకొన్ని సీరియల్స్ లో అయితే ఈవిడ అదే మన కధనాయక పని మనిషి. హీరో తో పెళ్లి అవుతుంది. ఈవిడ కష్టాలు ఉంటాయి చూడండి…బాబోయ్….అనిపించక మానదు. ఇంత కష్టాల్లో ఉన్న ఈవిడ కి మాత్రం మేకప్…నగలు…మంచి మంచి చీరలు ఉంటుయి. ఎలా వస్తాయో తెలీదు మరి.”

Ads

“ఇంక లేడీ విలన్లు… ఆ డిజైనర్ చీరలు ఏంటో…ఆ స్టేట్మెంట్ జాలరి ఏంటో…. ఆ హెయిర్ స్టయిల్ ఏంటి…అసలు ఎందుకు అలా ఉంటారో తెలీదు…ఇంకా వీళ్ళు అర్ధ రాత్రి కూడా మేకప్ తో పడుకుంటారు…ఉఫ్… అన్నిటి కంటే నాకు చేరెత్తు కొచ్చే విషయం….ఏదైనా జరిగితే చాలు…ప్రతి ఒక్కరి ముఖం మీద ఎక్స్ప్రెషన్లు క్లోజ్ అప్ లో చూపించడం…అంతేనా…. దీమ్ త…నా …న…దీమ్…త…న…న..న.. అని గుండె గుబులు పుట్టే సంగీతం.”

netizen funny answer about serials

“పోలీస్ లు…. అవసరం లేదు…హీరోయిన్ గారే…ఇంట్లో దొంగతనం నుంచి పెద్ద నేరాల వరకు కనిపెట్టేస్తారు…. మన హీరో గారు కొటేశ్వరులు….పాపం…సెక్యురిటి పెట్టుకోలేరు….హాస్పిటల్ లో హీరోయిన్ గారు ఉంటే…ఎవరో విలన్ మననుషులు ఆమెని చంపే ప్రయత్నం చేయడం లేదా ఆవిడ పిల్లలని ఎత్తుకుపోవడం… సి సి టీవీలు…పోలీసులు…ఏమి ఉండవు… మన వీరనారిమని కనిపెడుతుంది…లేదా దేవుడి ముందు పేజీ పేజీల డైలాగ్ లు చెప్తూ…ఏడుస్తుంది. మళ్ళీ మన హీరోయిన్ కూతురు…పెరిగి పెద్దది అయ్యి…అదే ఇంటికి వస్తుంది… మళ్ళీ కధ రిపీటూ….”

netizen funny answer about serials

“ఇంక మన హీరోయిన్ గారు… విలన్ల కుట్రలు భగ్నం చేస్తూ….హీరో ని…ఇంటిని…మధ్యలో వాళ్ళ బిసినెస్ ని చూసుకుంటూ….వంట చేస్తూ….కలెక్టర్…I.P.S కూడా అయ్యిపోతుంది…కష్టపడి ఎంట్రన్స్ పరీక్షలకు….ఉద్యోగ పరీక్షలకు….పగలు రాత్రి చదువుతుంటే అందరూ…ఈవిడ ఎప్పుడు చదివిందో….ఎప్పుడు పరీక్షలు రాసిందో…మళ్ళీ మొదటి ర్యాంక్ లొనే వస్తుంది ఈవిడ….”

netizen funny answer about serials

“హీరో గారు చెవి దుద్దులనో… ఈమె చేతులనో…చూసి ప్రేమించడం…ఈమె ఎవరో వెతకడం…కాస్త సెన్స్ తో తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి మచ్చుకకు కొన్ని మాత్రమే….లాజిక్ అనేది ఒకటి ఉందని…ప్రేక్షకులకు బుర్ర అనేది ఒకటి ఉంటుంది అనేది…తీసే వారు ఎప్పుడో మరచి పోయారు…ఇంక చూసేవారు చూస్తూనే ఉన్నారు….నాలా ఈ లాజిక్ లేని ఈ మేజిక్ లకు తల కొట్టుకునే వారు…ఇలా జవాబులు రాస్తున్నారు…. ఇదండీ మన సీరియళ్ల కధ.

-వర్షిత” అని వర్షిత గారు రాశారు.

netizen funny answer about serials

అయితే వర్షిత గారి అభిప్రాయం మాత్రమే కాదు, చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ఇలాగే ఉంది. ఇలాంటి ఒక అభిప్రాయాన్ని ఇంత క్రియేటివ్ గా కామెడీ కూడా యాడ్ చేస్తూ రాయడంతో వర్షిత గారిని చాలామంది అభినందిస్తున్నారు. ఏదేమైనా కూడా వర్షిత గారు చెప్పింది నిజమే కదా. సీరియల్స్ లో ఈ మార్పు వస్తే సీరియల్స్ స్థాయి ఇంకా పెరుగుతుంది ఏమో. అప్పుడు సీరియల్స్ కి కూడా ట్రోలింగ్ తగ్గి నిజంగానే సీరియల్స్ లో ఉన్న కంటెంట్ ని మెచ్చుకుంటారు.

ALSO READ : సినిమా రంగంలో సక్సెస్ అయిన సరిత నిజ జీవిత కథ గురించి తెలుసా..? 16 సంవత్సరాలకే..?

Previous articleశివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నియమం తప్పకుండా పాటించాలా..? సోమసూత్రం అంటే ఏంటో తెలుసా..?
Next articleగుడిలో “రజినీకాంత్” ని చూసి బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసింది ఆ మహిళ..చివరికి ఏమైందంటే?