భలే మోసం చేసారుగా.? మన తెలుగు సినిమా కథని “లియో” అని మళ్ళీ మనకే చూపించారుగా.?

Ads

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన లియో మూవీ నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లియో మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీని చూసిన తెలుగు ఆడియెన్స్ లోకేష్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
leo censor reviewకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబోలో తెరకెక్కడంతో లియో మూవీ పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. రిలీజ్ కు కొన్ని రోజుల ముందునుండే ఈ మూవీ పై ఇండియాలో ఏ సినిమాకి లేనంత హైప్ ఏర్పడింది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సంచలనం సృష్టించిన లోకేష్ కనగరాజ్, లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ క్రియేట్ చేసి, ప్రత్యేకతను చాటుకున్నాడు.లియో మూవీ కూడా అందులో భాగం అనే టాక్ తో ఈ మూవీ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షోతోనే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీని చూసినవారు లోకేష్ ను నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. జగపతిబాబు నటించిన గాయం 2 మూవీ స్టోరీ, లియో స్టోరీ దాదాపు ఒకేలా ఉన్నాయని అంటున్నారు.
లియోలో హీరో కాశ్మిర్ లో చాక్లెట్ బేకరీని నడుపుతూ తన కుటుంబంతో హ్యాపీగా ఉంటాడు. ఒకసారి హీరో ఫ్యామిలీ పై గుర్తు తెలియని మనుషులు దాడి చేస్తారు. వారెవరు? హీరో ఫ్యామిలీ పై ఎందుకు దాడి చేశారు? వాళ్ళు వెతుకుతున్న గ్యాంగ్ స్టర్, హీరో ఒకరేనా? అనేది లియో కథ. గాయం 2 సినిమా స్టోరీ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ఈ మూవీ 2010 లో రిలీజ్ అయ్యింది. రెండు సినిమాల స్టోరీ ఒకటే కావడంతో నెటిజెన్లు మా మూవీని కాపీ చేసి, మాకే చూపిస్తున్నావా? అని లోకేష్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Ads

Also Read: 1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!

 

Previous articleఈ ముగ్గురిలో “దసరా” విన్నర్ ఎవరు.? రెండో రోజుకి లెక్కలు మారిపోయాయిగా.?
Next articleరిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్లారు…కానీ అక్కడ చేదు అనుభవం.! ఏమైందంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.