Ads
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రెండు సార్లు జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ రెండు పర్యాయాలు ఐటి మినిస్టర్ గా కేటీఆర్ కొనసాగారు. ఆయన నేతృత్వంలో ఐటీ శాఖ సమర్థవంతంగా అభివృద్ధి చెందింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
యువత కేవలం ఉద్యోగాల పైన మాత్రమే ఆధారపడకుండా వ్యాపారవేత్తలుగా కూడా ఎదగాలి అనే ఆలోచనతో రూపొందించిన టి హబ్ కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపము. ఇలా అతని నేతృత్వంలో హైదరాబాద్ యువత కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించాయి.
అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ గెలిచింది. దీంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేసిన రెండు విషయాలలో ఒకటి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అయితే రెండవది.. ఐటీ మంత్రిగా ఎవరిని ప్రకటిస్తారు? కెసిఆర్ కి రీప్లేస్మెంట్ ఉంటుందేమో కానీ హైదరాబాద్ యువత దృష్టిలో కేటీఆర్ ని రీప్లేస్ చేసే సమర్థత వేరొకరికి లేదు. ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠతకు తెరపడుతూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఐటి మినిస్టర్ ఎవరు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
Ads
బీఆర్ఎస్ ఓటమి తరువాత కేటీఆర్ కి మద్దతుగా సోషల్ మీడియాలో ఎంతోమంది పోస్టులు పెట్టడం దీనికి నిదర్శనం. కేటీఆర్ నిజంగా ఒక డైనమిక్ ఐటీ మినిస్టర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలా తెలంగాణ ఐటి శాఖపై కేటీఆర్ తనదైన చెరగని ముద్ర వేశాడు. అయితే ప్రస్తుతం ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మదన్మోహన్ రావు కు ఐటీ శాఖ అప్పగిస్తున్నట్లు టాక్. మదన్ మోహన్..ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేయడమే కాకుండా..USM బిజినెస్ సిస్టమ్ అనే సంస్థను ఉన్నత విద్యతోపాటు.. కమ్యూనికేషన్ ,స్కిల్ డెవలప్మెంట్ పై మంచి అవగాహన కూడా ఉన్న వ్యక్తి కాబట్టి.. కేటీఆర్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్ధుడు ఇతడే అని అందరూ భావిస్తున్నారు