Ads
సాధారణంగా హోటళ్లు లేదా రెస్టారెంట్లలో తయారు చేసే ఆహారానికి నాణ్యతా ప్రమాణాలు అనేవి ఉంటాయి. వారు ఆ ప్రమాణాలు మెయింటెన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు లేదా రెస్టారెంట్లలో తనిఖీ చేస్తుంటారు.
Ads
నిర్ణీత ప్రమాణాలను ఫాలో కానీ వ్యాపారులకు పెనాల్టీ విధిస్తుంటారు. కస్టమర్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకుంటారు. కానీ రోడ్డు సైడ్ లభించే ఫుడ్, స్నాక్స్ లాంటి వాటికి ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు కానీ రూల్స్ కానీ ఉండవు. వారి దగ్గర కొనుగోలు చేసే ఫుడ్ బాలేకున్న ఏమీ చేయలేరు. అయితే జీహెచ్ ఎంసీ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసేవారికి కొత్త రూల్స్ ని తీసుకురానుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ కు ఆదరణ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఏ వీధిలో చూసిన కనీసం ఒక్కటైనా పాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది. తక్కువ ధరకు లభించడంతో వీటికి రోజు రోజుకి గిరాకీ పెరుగుతోంది. ఈ తక్కువ రేట్ కు రకరకాల కర్రీస్ తో రుచికరమైన భోజనం లభిస్తుండడంతో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ వారి దగ్గరకు మధ్యహ్న సమయంలో పెద్ద సంఖ్యల్లో జనాలు ఆరగిస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఉద్యోగస్తులు, హాస్టల్స్ లో ఉండేవారు, ఉపాధి పనులు చేసుకునే బ్రతికే వారు, క్యాబ్, ఆటో నడిపేవారు ఎక్కువగా ఉంటున్నారు.
ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసే కుమారి అంటీ నెట్టింట్లో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. ఆమె గురించి వైరల్ అవడంతో ఆమె వండిన ఫుడ్ రుచి చూడడం కోసం భారీ సంఖ్యలో ఆహారప్రియులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫుడ్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడం, పోలీసులు ఆమె ఫుడ్ బిజినెస్ ను మూయించారు. ఆ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి జోక్యంతో కుమారి అంటీ బిజినెస్ మళ్ళీ మొదలుపెట్టారు. ఆమెలా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు. జీహెచ్ ఎంసీ అధికారులు వారి కోసం కొత్త నిబంధనలను తీసుకురాబోతున్నారు.
అయితే వీటిలో ఎక్కువగా క్వాలిటి లేని ఫుడ్ ని, తక్కువ ధరకే అమ్ముతుండడంతో వారి దగ్గరికెళ్ళే వారి సంఖ్య ఎక్కువ. కానీ నాణ్యత లేని ఫుడ్ ను తినడం అనారోగ్యం. అందుకే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులకు గుర్తింపు కార్డును ఇవ్వడం, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ను ఫుడ్ సేప్టీ ఆఫీసర్లతో తనిఖీలు చేసి, నాణ్యత పాటించేలా చూడాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యాపారస్తులకి స్ట్రీట్స్ ను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: టీ, టోస్ట్ కి అంత రేటా.? వైరల్ అవుతున్న అయోధ్యలోని రెస్టారెంట్ బిల్.!