ప్రవళిక కేసులో ట్విస్ట్…అతన్ని శిక్షించాలి అంటూ సంచలన విషయాలు బయటపెట్టిన తల్లి.!

Ads

వరంగల్ విద్యార్ధిని ప్రవళిక బలవన్మరణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా పడటంతో ప్రవళిక తీవ్ర మనస్తాపంతో ప్రాణం తీసుకుందని, స్టూడెంట్స్, స్టూడెంట్ యూనియన్స్, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశారు.

ప్రవళిక చనిపోవడానికి కారణం ప్రభుత్వమే అంటూ రాజకీయ నాయకులు ఆందోళనలు చేశారు. అయితే  ప్రవళిక కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. తాజాగా ప్రవళిక చనిపోవడానికి కారణం గ్రూప్-2 వాయిదా కాదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్ టివి న్యూస్ కథనం ప్రకారం, ప్రవళికది ఆ-త్మ-హ-త్య కాదని, ప్రభుత్వ హ-త్య అంటూ రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవళిక మరణం పై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె తల్లి, తమ్ముడు వీడియోను రిలీజ్ చేశారు. ‘శివరామ్ అనే యువకుడి వేధింపులు భరించలేక, తమతో చెప్పుకోలేక, తీవ్ర మనోవేదన అనుభవించి తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని ప్రవళిక తల్లి చెప్పుకొచ్చింది.

Ads

తన ఇద్దరు పిల్లలను చదివించడం కోసం కూలీ నాలీ చేసుకుంటూ కష్టపడ్డానని తెలిపారు. తన కుమార్తెను వేధించి, చావుకు కారణమైన శివరామ్‌ ను శిక్షించాలి. మీకు మీకు పార్టీల తరుపున గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలని, మమ్మల్ని అందులోకి లాగొద్దని, అది చెప్పమని , ఇది చెప్పమని వచ్చి టార్చర్ పెట్టకండి’ అని వేడుకుంది.
ప్రవళిక తమ్ముడు ప్రణయ్ మాట్లాడుతూ ‘శివరామ్ అనే వ్యక్తి  అక్కకు ఒక అమ్మాయి ద్వారా పరిచయమయ్యాడని, ఇక అప్పటి కాల్ చేసి విసిగించే వాడని, హాస్టల్ దగ్గరికి వచ్చి ఏడింపిచేవాడని తెలిపాడు. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే వేరే నెంబర్ల నుంచి కాల్ చేసేవాడని, అతని వేధింపులను తల్లిదండ్రులకు చెప్పుకోలేక, వాటిని భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళి, ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ప్రభుత్వం తమ ఫ్యామిలీకి న్యాయం చేయాలని, శివరామ్‌కు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరాడు.

Also Read: జగన్‌ లాంటి సీఎం మాకూ కావాలంటున్న తమిళనాడు ప్రజలు..! ఎందుకో తెలుసా.?

Previous articleఈ 10 మంది డైరెక్టర్లకి మొదటి అవకాశం “రవితేజ” ఇచ్చారని మీకు తెలుసా.?
Next articleనవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.? అయితే ఈ 5 ఆహారాలు అస్సలు తినకూడదు.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.