“నిజం” సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన నటి “తాళ్లూరి రామేశ్వరి” ఇప్పుడెలా ఉన్నారో చూశారా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాను అంతా సులభంగా మరిచిపోరు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక్కడు లాంటి మాస్ హిట్ తర్వాత మహేష్ ఎంచుకున్న డిఫరెంట్ స్టోరీ ఇది.

ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్, హీరోయిన్ రాశి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లో మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.

nijam movie mahesh babu mother talluri rameswari

 

ఈ చిత్రం లో తాళ్లూరి రామేశ్వరి మహేష్ తల్లి సీతామాలక్ష్మి పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన భర్తను చంపిన వారందరినీ కొడుకు సహాయంతో ఆమె ఎలా చంపగలిగింది అనే విషయం చూస్తేనే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది. ఈమె తెలుగులో తక్కువ చిత్రాలే చేసినా.. హిందీ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్న రామేశ్వరి.. శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి.

Ads

 

ఇకపోతే దిగ్గజ నటుడు నజీరుద్దీన్ షా పక్కన సునయన అనే సినిమా చేస్తుండగా రామేశ్వరి కంటికి గాయం అయింది. దీని కారణంగా ఆమెను తీసేసారు. మేశ్వరి టాలెంట్ చూసిన నిర్మాత మాత్రం ఆమెకు నయమయ్యే వరకు నిరీక్షించి ‘ఆశా’ సినిమా తీశారు. ఇక అలా దుల్హన్ వోహి జో పియా మన్ భాయే, ప్రతిభ, ద్రోహి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ లో ఒక అరుదైన ఘనత సృష్టించింది.

 

ఇక అక్కడ బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీగా ఎదుగుతున్న సమయంలోనే.. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ హీరోగా ఈమె హీరోయిన్గా నటించిన సీతామాలక్ష్మి సినిమా మంచి విజయం సాధించింది. ఇక తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని 1988లో చిన్నోడు పెద్దోడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 

ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో నిజం సినిమాలో హీరోకి తల్లిగా నటించిన ఈమె రౌడీ ఫెలో , నందనవనం 120 కిలోమీటర్స్ వంటి సినిమాలతో పాటు అమెరికా అమ్మాయి అనే సీరియల్ లో కూడా నటించి తెలుగువారిని అలరించారు.ఈమె నటించిన సీతామహాలక్ష్మీ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత రామేశ్వరి తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ సేథ్ ని పెళ్లాడింది. ఆమెకు ఇద్దరు కుమారులు. నటి రామేశ్వరి తెలుగు, హిందీ, ఒడియా, తదితర భాషలలో కలిపి దాదాపుగా 25 కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

Previous articleకాజల్ తన భర్తకి ఇలా చెప్పారా..? వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అసలు విడాకులు అనే మాటే రాదేమో..!
Next articleప్రతి విషయానికి ఏడ్చే ఆడవారిని నమ్మాలా..? నమ్మకూడదా..? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.