Ads
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి. వారి లగ్జరీ లైఫ్ స్టైల్ తో, వ్యాపార సంస్థలు మరియు వారి ఫ్యామిలో జరిగే వేడుకలు, వారు చేసే సామజిక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
Ads
బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఆమె ఫ్యామిలీ గురించి లేదా కార్యక్రమాల గురించి వార్తలు వస్తుంటాయి. అయితే నీతా అంబానీ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి అంతగా తెలియదు. ఆమెకు ఒక చెల్లెలు ఉన్నారు. ఆమె ఎవరో? ఏం చేస్తుంటారో ఇప్పుడు చూద్దాం..
నీతా అంబానీ 1963లో నవంబర్ 1న ముంబైలోని మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో రవీంద్రభాయ్ దలాల్, పూర్ణిమా దలాల్లకు నీతా దలాల్‌గా జన్మించారు. ఆమె సోదరి పేరు మమతా దలాల్. నీతా అంబానీ కంటే ఆమె నాలుగేళ్లు చిన్నది. మమత వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ఆమె ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కు పాఠాలు బోధిస్తుంది. అది మాత్రమే కాకుండా ఆమె పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఆమె అక్క నీతా అంబానీ ఈ సంస్థ వ్యవస్థాపకురాలు మరియు చైర్పర్సన్.
ఇక ఈ పాఠశాలలో ఎక్కువగా ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన పిల్లలు, సెలబ్రెటీల పిల్లలు చదువుతారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, మమతా దలాల్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖానా మరియు సచిన్ టెండూల్కర్ పిల్లలకు పాఠాలు చెప్పారట. ఆమె ఎడ్యుకేషన్ వర్క్‌షాప్‌లు లేదా క్యాంపులను నిర్వహించడం లాంటి టీచింగ్ ను అమలు చేయడంలో కూడా చురుకుగా ఉంటుంది.
అయితే మమతా దలాల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఆమె తన అక్క నీతా అంబానీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇక నీతా అంబానీ భరతనాట్య నృత్యకారిణి, వ్యవస్థాపకురాలు, మహిళలు మరియు పిల్లల హక్కుల కోసం పోరాడుతుంది. ఆమె స్థాపించి, చైర్మన్‌గా పనిచేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో సేవ చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: ఆ స్కూల్లో ఫీజుకి బదులు.. ఏం తీసుకు రావాలంటే..?