Ads
డాక్టర్ బాబు, నిత్యా మీనన్, తిరువీర్ కాంబినేషన్ లో వచ్చిన వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ప్రస్తుతం కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ప్రేక్షకులు సినిమాల కంటే సీరియల్స్ ను వెబ్ సిరీస్ ను ఎక్కువగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరి తాజాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో చూద్దాం పదండి.
హీరోయిన్ గా ఇప్పటివరకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. అలాగే మసూద లో హీరోగా చేసిన తిరువీరితోపాటు మన కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు కూడా. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి…ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నుంచి 40 నిమిషాల నిడివి తో సాగుతుంది. ఇంతకీ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో తెలుసా…పెద్దం లేదండి మన మధ్యతరగతి జీవితాలే..
రాజమహేంద్రవరంలో రామరాజు లంక అనే ఒక చిన్న గ్రామంలో…హోటల్ లో ఫ్లోరింగ్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటుంది ఇటుకలపూడి శ్రీమతి ( నిత్యామీనన్). అయితే ఆమె జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే తమ సొంత ఇంటిని అమ్మనని చిన్నతనంలోనే తాతయ్య (మురళి మోహన్) కు మాట ఇస్తుంది. కానీ అనుకోకుండా ఆమె బాబాయ్ తో వచ్చిన ఆస్తి గొడవల కారణంగా ఇల్లు, రైస్ మిల్లు పోగొట్టుకుంటుంది. చేసేదేమీ లేక తన తల్లి, నానమ్మ, చెల్లి తో కలిసి వేరే ఇంట్లో అద్దెకు ఉంటుంది.
Ads
అయితే తమ తాతల కాలంనాటి ఇంటిని బాబాయి పడగొట్టడానికి ప్రయత్నించడంతో ఆమె కోర్టును ఆశ్రయిస్తుంది. కానీ కోర్టులో తీర్పు కేశవరావుకి అనుకూలంగా వస్తుంది. అంతేకాదు శ్రీమతికి కావాలి అంటే 38 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటిని కొనుక్కోమని చెప్పిన జడ్జ్ అమెకు ఆరు నెలల గడువు ఇస్తారు. ఎలాగైనా డబ్బు సమకూర్చడం కోసం శ్రీమతి బార్ ఓపెన్ చేయాలి అని భావిస్తుంది.
మధ్యతరగతి జీవితాలను ఎంతో అద్భుతంగా ఈ వెబ్ సిరీస్ లో తెరకెక్కించారు. 13వేల రూపాయలతో 38 లక్షల సంపాదించాలి అనే శ్రీమతి ఆశ.. 30 సంవత్సరాలు వచ్చిన కుటుంబం కోసం పెళ్లి చేసుకొని ఒక మధ్యతరగతి అమ్మాయిగా శ్రీమతి భావోద్వేగాలు అందరి మనసులని హత్తుకునే విధంగా ఉన్నాయి.ఇంతకీ ఆమె బార్ పెట్టిందా? ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి సమస్యలను ఎదుర్కొంది? ఆమె పోరాటంలో ఆమెకు అండగా ఎవరు నిలబడ్డారు? తెలుసుకోవాలి అంటే వెంటనే కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ చూసేయండి