ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరోయిన్‌..

Ads

భారతీయ సిని పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన కథానాయకలు అతి తక్కువ మంది ఉన్నారు. వారిలో  ‘నిత్యామీనన్‌’ ఒకరు. ఆమె నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గా, సింగర్‌గా నిరూపించుకున్నారు. అలా మొదలైంది చిత్రంతో నిత్యామీనన్‌ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Ads

హీరోయిన్‌ నిత్యామీనన్‌ దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక రేటింగ్ పొందిన కథానాయకలలో ఒకరు. ఆమె బెంగళూరులో జన్మించింది. నిత్యా బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హీరోయిన్ గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. నిత్యామీనన్‌ ఏ పాత్ర చేసినా అందులో సహజత్వం ఉంటుంది. ఆమె ఏది పడితే ఆ క్యారెక్టర్ ను ఒప్పుకోదు. యాక్టింగ్ కు అవకాశం ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఒప్పుకుని పేరు తెచ్చుకుంటోంది.
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు. ఇప్పటి దాకా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గాను నటించారు. గత ఏడాది కోలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘తిరుచిత్రంబళం’ లో హీరో ధనుష్ కు జంటగా నటించింది. ఇందులో హీరోకి చిన్ననాటి ఫ్రెండ్ గా నటించి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ మూవీ వంద కోట్ల రూపాయలకు పైన కలెక్ట్ చేసింది.
నిత్యామీనన్‌కు నటన కొత్త కాదు 10 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి వచ్చారు. నిత్యామీనన్‌ బాలనటిగా 1998లో ‘హనుమాన్‌’ అనే చిత్రంలో నటించారు. ప్రెంచ్‌-భారతీయ ఫిల్మ్‌ దర్శకుడు ఫెడ్రిక్‌ ఫోజియా డైరెక్షన్ లో వచ్చిన  ఈ సినిమాలో నిత్యా టబుకు చెల్లెలిగా నటించింది. ఈ మూవీ ‘సినీ క్వెస్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ లో అవార్డును అందుకుంది. ఆ మూవీలోని బాలనటిగా చేసిన నిత్యామీనన్‌కు ప్రస్తుతం నిత్యా మీనన్‌కు ఫేస్‌ లో ఎక్కువ తేడా ఏమి లేదు. ఆమెను చూడగానే గుర్తు పట్టవచ్చు. ప్రస్తుతం నిత్యామీనన్‌ చిన్ననాటి ఫోటోలు మరియు వీడియో నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. Also Read: మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Previous articleఅండర్ 19 ప్రపంచకప్‌ లో తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు..! ఇంతకీ వీళ్ళు ఏం మాట్లాడారో చూశారా..?
Next articleసినిమాల్లో నటుల బట్టలు ”మురికి” గా కనపడాలంటే ఏం చేస్తారు…?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.