Ads
ఎన్టీఆర్ నట వారసుడిగా సినిపరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాంటి చిత్రాల్లో ఒక సినిమానే మంగమ్మ గారి మనువడు. ఈ సినిమా బాలకృష్ణకు కెరీర్ ను టాప్ లోకి తీసుకెళ్లింది.
Ads
డైరెక్టర్ భారతీ రాజా తమిళంలో తీసిన ‘మణ్ వాసనై’ సినిమాని కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగులో మంగమ్మగారి మనవడుగా రిమేక్ చేశారు.ఈ సినిమాలో మంగమ్మ పాత్ర కీలకమైనది. ఈ సినిమా తీయబోయే ముందు ఎన్టీఆర్ ఆ పాత్రను భానుమతితో చేయించండి. ఆమె చేయను అంటే ఇక ఈ మూవీని తియ్యకుండా ఉండడమే మంచిదని ఖచ్చితంగా చెప్పారంట. అలా చెప్పడమే కాకుండా స్వయంగా ఆయనే ఫోన్ చేసి ఈ మూవీలో నటించేందుకు భానుమతిని ఒప్పించారంట.అలనాటి సీనియర్ నటి భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఇలా అన్నింటికీ మించి ఉన్నతమైన విలువలు ఉన్న మనిషి. అయితే ఈ సినిమా షూటింగ్ కు ముందు బాలకృష్ణ ని పిలిచి, ఎన్టీఆర్ మూడు విషయాలు చెప్పి, వీటిని ఖచ్చితంగా పాటించాలని చెప్పారంట. ఆ మూడు విషయాలు ఏమిటో చూద్దాం..
1) భానుమతిగారు షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే బాలయ్య అక్కడ ఉండాలని చెప్పాడు. ఏ ఒక్క రోజు కూడా ఆమెని వెయిట్ చేయించవద్దు.
2) భానుమతిగారు కారు దిగేందుకుబాలకృష్ణనే కారు డోరు తీయాలని చెప్పాడు.
3) ఆమె కారులో నుండి దిగగానే కాళ్లకు నమస్కరించాలని చెప్పాడు.ఇక ఎన్టీఆర్ పెట్టిన ఈ కండిషన్లకు బాలకృష్ణ ఒప్పుకోవడమే కాకుండా ఆ సినిమా షూటింగ్ జరిగిన అన్ని రోజులు వీటిని పాటించాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పుడు ఇచ్చిన ఆ మర్యాద ఆ మూవీ తరువాత కూడా కొనసాగింది.
Also Read: హీరో గోపీచంద్ నాన్న దర్శకత్వం చేసిన సినిమాలు ఏమిటో తెలుసా?