ఈ సినిమాలో హీరోయిన్ హీరో కన్నా పెద్దది.. ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రమే ఎన్టీఆర్ అలా చేసారు.!

Ads

సింహాద్రి సినిమా ఎన్టీఆర్ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.ఆది సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ కి ఆ తర్వాత విడుదలైన రెండు సినిమాలు ఎన్టీఆర్ కి ఫ్లాప్ ని మిగిల్చాయి. ఇప్పుడు తన కెరీర్ ముందుకు సాగాలంటే కచ్చితంగా ఒక హిట్ సినిమా పడి తీరవలసిందే. అదే సమయంలో రాజమౌళి తన రెండవ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. రాఘవేంద్రరావు కొడుకుతో సినిమా తీయటానికి కమిట్ అయ్యాడు.

కానీ బడ్జెట్ ఇష్యూ తో ఆ సినిమా ఆగిపోవడంతో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని తీసుకొని ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించాడు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ దక్కించుకొని అటు రాజమౌళికి ఇటు ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని ఏర్పరిచింది. నిజానికి కధ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇంత చిన్న పిల్లవాడు అంత బరుమైన పాత్రని మోయగలడా అని అనుమానం పడ్డాడట.

Ads

కానీ రాజమౌళి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని నమ్మి ఆ పాత్ర అతని తో చేయించాడు. రాజమౌళి నమ్మకాన్ని నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమాలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే సినిమా హీరోయిన్లలో ఒకరైన భూమిక ఎన్టీఆర్ కన్నా పెద్దది. ఎన్టీఆర్ తన కెరీర్ లో నటించిన హీరోయిన్స్ అందరిలో ఎన్టీఆర్ కంటే పెద్ద భూమిక ఒక్కరే అంట. ఇదే విషయంగా అప్పట్లో పెద్ద డిస్కషన్ కూడా నడిచింది కానీ సినిమా హిట్ అవ్వటంతో ఆ డిస్కషన్ కి పెద్దగా వ్యాల్యూ లేకుండా పోయింది.

వయసులో పెద్దదైనప్పటికీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సీన్లు ఎంతో బాగా పండాయి అంకిత కూడా తన అందంతో సినిమాకి మరింత వన్నెలో తీసుకువచ్చింది. కీరవాణి మ్యూజిక్ సినిమాని మరో రేంజ్ కి తీసుకు వెళ్ళింది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమా కదా నచ్చలేదని సినిమాని రిజెక్ట్ చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ.

Previous articleDEVIL REVIEW : “నందమూరి కళ్యాణ్ రామ్” డెవిల్ మూవీతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్..!
Next article“మంగళవారం”లో హీరోయిన్ కంటే ఎక్కువగా ఈమె ట్రెండ్ అవుతుందిగా.? ఇంతకీ ఎవరు ఈమె.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.