Ads
సాధారణంగా తల్లితండ్రులు కాబోతున్న భార్యభర్తలు చాలా సంతోషంగా వారికి పుట్టబోయే బిడ్డ గురించి ఎదురుచూస్తుంటారు. అది మొదటిసారి అయితే ఆ జంటకు ఆనందంతో పాటుగా థ్రిల్ గా కూడా ఉంటుంది. ఇక స్త్రీలకు అయితే తొలిసారి తల్లి కాబోతున్నవారి సంతోషం, అనుభూతి మాటల్లో చెప్పలేం.
Ads
గర్భిణీ స్త్రీలు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎప్పుడూ చూస్తానా? బయటకు ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తూ ఉంటారు. మాతృత్వం అనేది గొప్ప వరం. అది మహిళలకు మాత్రమే లభించేది. ఇక శిశువు కడుపులో ఉన్నప్పుడు వారి కదలికలు తల్లికి తెలుస్తుంటాయి. అయితే బిడ్డ అప్పుడప్పుడు తన్నడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఇలా తన్నుతుంటారో చూద్దాం.
సహజంగా కడుపులో ఉన్న శిశువు తన్నడాన్ని స్త్రీలు గొప్పగా అనుభూతి చెందుతూ ఉంటారు. వాస్తవానికి శిశువు తన్నడం అనే విషయం చాలా సహజంగా జరిగే ఒక ప్రక్రియ. గర్భం దాల్చిన స్త్రీకి ఇరవై నుండి ముప్పై వారాల సమయంలోనే శిశువు తన్నడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ 35వ వారానికి వచ్చిన తరువాత ఆగిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో శిశువుకు ఎముకలు పెరుగుతుండడం, కీళ్లలో మార్పులు వస్తుంటాయి. అందువల్ల శిశువు కడుపులో తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా కాసేపు కూర్చుంటేనే, మన కాళ్లను కదిలించకుండా ఉండలేము కదా. మరి కడుపులో ఉన్న శిశువు కూడా అలా కాళ్లను కదిలించినపుడు, దాన్నే మనం బిడ్డ తన్నుతున్నాడు అనుకుంటాం. అలా తన్నుతుంటేనే ఆ శిశివుకు సౌకర్యంగా ఉంటు ఉండచ్చు. అందుకే శిశువు అలా చేస్తుంది. అయితే కడుపులో ఉన్న శిశివు ఎక్కువ తన్నితే ఆ శిశువు అంత హెల్దీగా ఉంటుందని సైంటిస్టులు వారి అధ్యయనాల్లో తెలుసుకుని చెబుతున్నారు. ఇంకా కడుపులో ఉన్నప్పుడు బాగా తన్నే శిశువులకు నాడీ సమస్యలు రావని, ఆరోగ్యంగా కూడాఅ ఉంటారని చెబుతున్నారు.
Also Read: అమ్మాయిలూ.. 25 తరవాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?