Ads
ప్రస్తుతం కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా దానికి భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈవెంట్ మేనేజర్లకి ఇచ్చి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు.
అయితే పెళ్లి జరిగిన పుట్టినరోజు జరిగిన అందులో సౌండ్ సిస్టం అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. ఆటపాటలు డాన్సులతో ఫంక్షన్ సాగుతూ ఉంటుంది. అయితే సౌండ్ సిస్టం కూడా మామూలు సౌండ్ సిస్టం కాకుండా డిజె సిస్టలని పెట్టి హోరెత్తిస్తున్నారు.
మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఆ వేడుక కోసం పెళ్ళి కూతురు ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్చుకుంది. అయితే ఆ డ్యాన్స్ ఈవెంట్ మొదలైన తర్వాత సజావుగా సాగలేదు.పెళ్లి కూతురు డ్యాన్స్ వేసే సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి డీజేను ఆపేయాలని ఆదేశించారు. అంత పెద్ద సౌండ్లను అనుమతించేది లేదని తేల్చి చెప్పాడు.
Ads
దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఆమె నిరాశను గమనించిన స్నేహితులు వెంటనే సూపర్ ప్లాన్ వేశారు. మ్యూజిక్ సిస్టమ్ ఉన్న ఓ ఓలా స్కూటర్ ను ఆ వేదిక వద్దకు తీసుకొచ్చి పాట ప్లే చేశారు. ఓలా స్కూటర్ లో పాట ప్లే అవుతుండగా పెళ్లికూతురు డాన్స్ వేసింది దీంతో ఆ వేడుక అంతా సరదాగా సాగిపోతూ ఆనందంగా ముగిసింది.
4 baj gaye lekin party abhi bhi baaki hai! Haha.! Love how Ola scooters have become a part of our community celebrations across India!
Way to go community, keep the creativity going! https://t.co/58gErrKq4P
— Bhavish Aggarwal (@bhash) January 12, 2024
ఆ పెళ్లికి హాజరైన వారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఓలా సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్‌ను బాగా ఆకర్షించింది. ఆ వీడియోను రీట్వీట్ చేసిన భవిష్….మన సంస్కృతిలో ఓలా స్కూటర్ భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్రియేటివిటీ ఇలాగే కొనసాగాలని కామెంట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.