63 ఏళ్ల బాలకృష్ణ పక్కన…33 ఏళ్ల హీరోయిన్..! కూతురి లాగా ఉంటుంది ఏమో..!

Ads

హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించారు. బాలయ్య 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు.

Ads

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కంప్లీట్ చేసుకుని షూటింగ్‌ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బాలయ్య 109వ సినిమాలో హీరోయిన్ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఈ విషయం గురించి ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బాలయ్య వరుస విజయాల అందుకున్నారు. 63 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. నెక్స్ట్ సినిమాని డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. బాబీ ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య మూవీతో విజయాన్ని అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి సినివర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. శ్రద్ధ శ్రీనాథ్ జెర్సీ మూవీతో టాలీవుడ్ లి అడుగుపెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తరువాత జోడీ, కృష్ణుడు అండ్ హిస్ లీల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ రాబోయే సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. 63 ఏళ్ళ బాలయ్య పక్కన 33 ఏళ్ళ వయసున్న శ్రద్ధ హీరోయినా అని కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరో పక్కన నటిస్తే, యంగ్ హీరోలు పక్కన నటిస్తున్న శ్రద్ధకు అవకాశాలు రావని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 2023 లో టాలీవుడ్ లో అడుగుపెట్టి… మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్న 7 హీరోయిన్స్ వీళ్ళే.!

Previous articleగంగూలీ కూతురా మజాకా…21 ఏళ్లకే సాధించిన ఈ విజయం తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.
Next article“వేణుమాధవ్” తో ఉన్న ఇతను ఎవరో గుర్తుపట్టారా.? తెలంగాణలో చాలా ఫేమస్.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.