సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికీ తెలీదు…కానీ ఓటిటిలో వచ్చాక సెన్సేషన్ అయిన ఈ సినిమా చూసారా.?

Ads

రీసెంట్ గా తెలుగులో నేటివ్ చిత్రాల కంటే కూడా మలయాళం డబ్‌ చిత్రాలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల అవుతుంటే మరికొన్ని నేరుగా ఓటీటీల్లో వస్తున్నాయి. కాన్సెప్ట్ ,కంటెంట్ రెండు నచ్చడంతో ఇటువంటి మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. మనసుకు హత్తుకునేలా ఉండే కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

సినిమా థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ మూవీస్ కి భారీగా రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా పద్మిని అనే మలయాళ సూపర్ హిట్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫారం లో స్ట్రీమింగ్ అవుతోంది.మలయాళ హీరో కున్‌చకో బొబన్‌ మెయిన్ లీడ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది. జూలై 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాగా కలెక్షన్స్ రాబట్టింది.

Ads

ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా వర్క్ చేసే రమేష్ కథలు కూడా రాస్తూ ఉంటాడు. అలాంటి అతను పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. అయితే పాపం పెళ్లి చేసుకున్న ఫస్ట్ డే అతని భార్య లవ్ చేసిన వ్యక్తితో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అతని తల్లిదండ్రులు రెండవ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది.. అఫీషియల్ గా డైవర్స్ తీసుకుంటే తప్ప పెళ్లి చేయమని పెళ్లికూతురు తల్లిదండ్రులు షరతు పెడతారు.

అయితే భార్య ఎక్కడికి ఎవరితో వెళ్ళిందో తెలియని రమేష్ ఆమెను ఎలా వెతికి పట్టుకుంటాడు? వెతికే క్రమంలో అతని ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? ఈ నేపథ్యంలో అతనికి లాయర్ ఎటువంటి సహాయం చేస్తుంది? అసలు ఈ మూవీలో పద్మిని ఎవరు? తెలియాలి అంటే పూర్తి కథ చూడాల్సింది.

Previous articleరతన్ టాటా వారసులు వీరే.. ఈ ముగ్గురు గురించి ఈ విషయాలు తెలుసా.?
Next articleFNCCలో ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.