Ads
పాకిస్తాన్ క్రికెట్ టీం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోనీలో అట్టర్ ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌లు విజయం సాధించిన పాకిస్తాన్ మిగిలిన ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. వాటిలో కూడా న్యూజిలాండ్ తో మ్యాచ్‌లో దక్కిన గెలుపు కూడా లక్కీగా వచ్చిందే అని చెప్పవచ్చు. ఈ ఫెయిల్యూర్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్. ఈ వాఖ్యల్లోకి బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ని ఇన్వాల్వ్ చేయడంతో పాటు ఆమె ప్రస్తావన తీసుకువచ్చి ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Ads
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియోలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ. యూనిస్ ఖాన్, కెప్టెన్‌గా చాలా మంచి లక్ష్యాలను నిర్ణయించుకున్నాడు. నేను బాగా రాణించడానికి అతను ఇచ్చిన కాన్ఫిడెన్స్ కూడా ఒక కారణం. అయితే పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ప్రతీ ప్లేయర్‌కి ఒక లక్ష్యం ఉండేది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని పటిష్టంగా చేయాలనే ఆలోచన మాత్రం ఎవ్వరికీ రాలేదు. ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు అని వ్యాఖ్యానించాడు అబ్దుల్ రజాక్.
రజాక్ పక్కనే కూర్చున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్ ఈ వ్యాఖ్యలకు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అయితే అబ్దుల్ రజాక్ చేసిన వాఖ్యలు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఐశ్వర్యరాయ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అబ్దుల్ రజాక్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు..