Ads
దాయదులు పాకిస్తాన్ 2023 ప్రపంచ కప్ లో తమ ఓటముల పరంపరం కొనసాగిస్తున్నారు. వరల్డ్ కప్ ప్రారంభంలో రెండు విజయాలు నమోదు చేసుకున్న తర్వాత వరుస పెట్టి పరాజయాల పాలవుతున్నారు. సోమవారం ఆఫ్గనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో కూడా ఓటమిపాలయ్యారు. తమకంటే పేలవ జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ పైన పాకిస్తాన్ ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
పాకిస్తాన్ ఏ దశలోనూ కూడా క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడం లేదు.అన్ని విభాగాల్లోను పూర్తిగా విఫలమైంది. తమ ఫీల్డింగ్ తో నవ్వులు పాలు అయ్యే పాకిస్తాన్ ఈసారి వరల్డ్ కప్ లో కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది.
Ads
తమకు దీటైన బౌలర్లు ఉన్నారని చెప్పుకునే పాకిస్తాన్ బౌలింగ్ లో కూడా తడబడుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆడిన ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ల్ లో నెగ్గింది. తన సెమీస్ ఆశలను కఠినతరం చేసుకుంది.ఈ ప్రపంచకప్ ఆరంభం కావడానికి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ గొప్పలు పలికాడు. తమకు సెమీస్ చేరడం చాలా చిన్న విషయం అంటూ కోతలు కోసాడు. కప్పు కొట్టేందుకే ఇండియాలో అడుగు పెట్టామని బిల్డప్ ఇచ్చాడు. తీరా ఇక్కడ చూస్తే మొత్తం అడ్డం తిరిగింది. తమ పెర్ఫార్మెన్స్ తో ట్రోలింగ్ కి గురవుతున్నారు.
సందర్భం దొరికినప్పుడల్లా భారత్ క్రికెటర్లను ఆడుపోసుకునే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మెంబర్లను, మాజీలను భారత్ అభిమానులు నెట్టింట బాగా ట్రోల్ చేస్తున్నారు. మీకు భారత్ తో పోలికేంటి, వెళ్లి స్కాట్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్ జట్ల పైన ఆడి గెలవండి అంటూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.పాకిస్తాన్ ఇక మిగిలిన నాలుగు మ్యాచ్లు మూడింటిని పెద్ద జట్లు అయిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడాలి. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే బంగ్లాదేశ్ పైన కూడా గెలిచేది కష్టంగా కనిపిస్తుంది.