ఈ క్రికెటర్ భార్య ముందు హీరోయిన్స్ కూడా తక్కువే ఏమో..! ఈమె ఎవరంటే..?

Ads

ఈరోజు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోసం ఇండియా చేరుకున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ వైఫ్ సమియా ఖాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియాలోని హర్యానాకు చెందిన సమియా.. హసన్ అలీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని కేవలం గర్భవతిగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే కలుసుకుందట.

pakistan cricketer wife

పెళ్లి తర్వాత ఇప్పటివరకు ఆమె హర్యానాలోని తమ ఇంటికి వెళ్ళింది లేదు. ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆమె పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో కలిసి ఢిల్లీలో అడుగు పెట్టింది. అయితే వెళ్ళగానే స్ట్రీట్ ఫుడ్ తినాలి అనుకోవడం కానీ హసన్ అలీ ఆ కోరిక తీర్చకపోవడంతో బాధపడడం తెలిసిందే. గత రెండు మ్యాచులు హైదరాబాదులో పూర్తిచేసుకున్న పాక్ జట్టు రెండు వారాలపాటు హైదరాబాదులో ఉన్నారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత హైదరాబాదులో కొన్ని ఫోటోలు దిగుతూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ads

pakistan cricketer wife

అప్పటివరకు ఆమె పేరు వినడమే కానీ చూడని వారు చాలామంది ఆ ఫోటోలో సమియా ఖాన్ ని చూసి ఎవరో హీరోయిన్ అనుకున్నారు. మోడరన్ డ్రెస్ లో ఎంతో గ్లామర్ గా ఉన్న ఆమె ఫోటోలను చూసి కొందరు నెటిజన్స్ ఎవరు ఈ హీరోయిన్ అని కామెంట్స్ పెడుతున్నారు. సమియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె బాలీవుడ్ భామలకు గట్టి పోటీ ఇవ్వడంలో ఏమాత్రం తీసిపోదు అని ఇట్టే అర్థమవుతుంది.

pakistan cricketer wife

ప్రస్తుత మహమదాబాద్ కు చేరుకున్న పాక్ జట్టు ఈరోజు ఇండియా టీం తో తలపడడానికి రెడీగా ఉంది. అయితే రెండు వారాలు హైదరాబాదులో మకాం ఉన్న పాక్ ప్లేయర్స్ అక్కడ గ్రౌండ్ స్టాప్ సేవలకు ఎంతో మురిసిపోయారు. రెండు మ్యాచ్ లు గెలవడమే కాక హైదరాబాదులో ఎందరో అభిమానుల అభిమానాన్ని చూసి వాళ్ళు ఎమోషనల్ అయ్యారు. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Previous articleటీమ్ ఓడిపోతుంటే ఇదేం పని.? ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని ఏమనాలి.?
Next article“వైయస్ విజయమ్మ” కి త్రుటిలో తప్పిన ప్రమాదం..! ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.