పల్లవి ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేసారు..? అసలు ఏం జరిగిందంటే..?

Ads

తెలుగులో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. ఇష్యూలోకి ఎంటర్ అవ్వాలని చాలామంది సామాన్యులు ఆశపడుతూ ఉంటారు. అలా రైతు బిడ్డని చెప్పుకుని బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ .సింపతి తోటి రైతుబిడ్డలను చెప్పుకుంటూ చివరికి టైటిల్ విన్నర్ అయ్యాడు.

బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ ఆ ఆనందం లేకుండానే ఇప్పుడు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. ఫైనల్ ఎపిసోడ్ తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద ప్రశాంత్ సపోర్టర్స్ చేసిన విధ్వంసానికి అతను కూడా ఒక కారణమని పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు.

Ads

pallavi prashanth

తన సపోర్టర్స్ ని అదుపు చేయడం మానేసి వారిని ఉత్సాహపరుస్తూ ఈ విధ్వంసానికి తాను ఒక కారణం అయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పల్లవి ప్రశాంత్ మీద మొత్తం 9 సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రశాంత్ తో పాటుగా అతని సోదరుడు రాజుపై కూడా పోలీసులు కేసు పెట్టారు.
దీంతో చంచల్ గూడ జైల్లోకి వెళ్ళాడు. ఇది చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ నుండి జైలుకి వెళ్ళాడు ప్లేస్ ఒకటే మారింది తప్ప అక్కడ ఇక్కడ సేమ్ పోసిషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు

Previous articleDunki Review : “షారుఖ్ ఖాన్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleఒకే ఒక్క ఫ్లాప్… ఇండస్ట్రీ మొత్తాన్ని అప్పుల్లోకి తోసేసింది..! ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?