Ads
సాధారణంగా జ్వరం, వాంతులు, ఒంటినొప్పులు వంటి సమస్యలు రాగానే వెంటనే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇక జ్వరం, తలనొప్పి లాంటివి వచ్చిన వెంటనే పారాసిటమాల్ వాడడం సర్వ సాధారణం అయిపోయింది.
Ads
ఈ టాబ్లెట్ ను ఎప్పుడు, ఎంత పరిమాణంలో వాడాలనేది ఎక్కువ మందికి తెలియదు. అయితే ఇలా ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం సమస్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. శరీరంలో ఏదైనా చిన్నపాటి నొప్పి అనిపించినా సరే వాటి నుంచి ఉపశమనం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తుంటారు. అయితే వాటి వల్ల శరీరంలో ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. తరచుగా పారాసెటమాల్ వాడడం వల్ల గుండె పోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు.
గుండె పోటు రావడానికి గల కారణాల్లో బీపి ముఖ్యమైనది. ఇక బీపీ పెరగడానికి సోడియం అనగా ఉప్పు కారణం. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె, ఇతర ప్రసరణ వ్యవస్థలకు ప్రమాదకరం. ఉప్పులో సోడియం ఉంటుంది. పారాసిటామాల్ టాబ్లెట్స్ ఈ సోడియం నిల్వలను పెంచుతున్నాయని తెలుస్తోంది. పారాసిటామాల్ టాబ్లెట్స్ ఇష్టానుసారంగా వాడడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు పెరిగి గుండె పోటు, కార్డియాక్ అరెస్టులకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.యూరోపియన్ హార్ట్ జర్నల్ మరియు చైనా సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా తరచూగా పారాసిటమాల్ తీసుకోవడం వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వచ్చే ప్రమాదం ఉంటుందని కనుగొన్నారు. అంతే కాకుండా పారాసెటమాల్ తరచూగా వాడడం వల్ల అల్సర్ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. జ్వరం రాగానే వెంటనే పారాసిటామాల్ ఉపయోగిస్తారు. అయితే ఈ టాబ్లెట్స్ ని వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా తరచూగా తీసుకుంటే ఎసిడిటీ, అల్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం హెచ్చరిస్తున్నారు.
Also Read: మూత్రపిండాలలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను పాటించండి..!