Ads
ఈమధ్య సినిమాలు థియేటర్లోకి వచ్చిన తర్వాత హిట్ అయినా ఫట్ అయినా ఫట్ అయినా సరే కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఓటీటీలో వ్యూయర్షిప్ ఎక్కువ రావడంతో వాళ్లకి డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు నుంచి పెద్ద పెద్ద సినిమాల వరకు ఒక రెండు వారాలు థియేటర్లో ఉంచి కలెక్షన్లు ఎక్కువగా లేకపోతే వెంటనే ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తున్నారు.
మొన్న మొన్న విడుదలైన డున్కి సినిమా కూడా జనవరి ఒకటో తారీఖున ఓటీటీ లో రిలీజ్ చేసేస్తున్నారట. అదే క్రమంలో తమిళంలో ఒక మంచి సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమా ఇంకేదో కాదు “పార్కింగ్”. జెర్సీ సినిమాలో నాని కొడుకుగా నటించిన హరీష్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ తో మంచిగా తీశారు. ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బానే వచ్చినా కొద్దిరోజుల్లోనే ఓటీటీ కి అమ్మేసారు.
Ads
అయితే ఈ సినిమా ఇంట్లో కూర్చొని న్యూ ఇయర్ కి కుటుంబం అంతా కలిసి హాయిగా చూసుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఇంక ఈ కథ విషయానికి వస్తే హీరో ఒక ఇంట్లో అద్దెకి ఉంటాడు. పెళ్లయిన తర్వాత ఒక కార్ ని కొని పార్కింగ్ ప్లేస్ లో పెడతారు. కానీ అదే పార్కింగ్ ప్లేస్ లో ఆ ఓనర్ కారు కూడా పెట్టుకోవాలనుకుంటాడు. ఆ పార్కింగ్ కోసం అని చెప్పి హీరోకి ఆ ఓనర్ కి గొడవలు అయిపోతాయి. రక్తాలు వచేసేలా కొట్టుకుంటారు. ఆఖరికి పోలీస్ కేసులు వరకు వెళ్తారు. తర్వాత ఏం జరిగింది?
అసలు ఆ పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా? లేదా? అనే దానిమీద సినిమా ఉంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎంతో కామెడీగా సింపుల్ గా ఉండే స్టోరీ. కుటుంబమంతా ఇంట్లో కూర్చొని న్యూ ఇయర్ కి హాయిగా చూసుకోవచ్చు. ఈ సినిమా హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ వీకెండ్ కి మంచి సినిమా సజెషన్ దొరికింది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఫ్యామిలీ అందరితో ఒకసారి ఈ సినిమాని ట్రై చేయండి.