షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోయిన.. పవన్ కళ్యాణ్ 7 సినిమాలేమిటో తెలుసా.?

Ads

పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చినా కూడా నిర్మాతలు మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈయన ఒప్పుకున్న సినిమాలు చాలా వరకు పూర్తికాలేదు. కొన్ని పట్టాలెక్కకుండానే ఆగిపోతే మరికొన్ని షూటింగ్ స్టార్ట్ చేశాక ఆగిపోయాయి. పవన్ చేసిన సినిమాలు తో పాటు ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వలన అవి అటకెక్కేసాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

#1. అమీషా పటేల్ హీరోయిన్ గా అప్పట్లో “చెప్పాలని ఉంది” అనే సినిమాని సూర్య మూవీస్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసింది. కానీ సినిమా ఎందుకో డిలీట్ అవటం మూలాన అదే సినిమాని నువ్వే కావాలి పేరుతో రిలీజ్ అవ్వటంతో ఈ సినిమా అటకెక్కేసింది.

#2. అలాగే అటకేక్కెసిన మరొక సినిమా సత్యాగ్రహి. జానీ తర్వాత మరొకసారి దర్శకత్వం వహించాలని పవన్ కళ్యాణ్ రాసుకున్న కథ ఇది కానీ ఎందుకో సెట్స్ మీదకి వెళ్లకుండానే ఈ కథ ఆగిపోయింది.

Ads

#3. దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా రాసుకొని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న మరొక సినిమా దేశి. కానీ ఇది కూడా పట్టాలెక్కకుండానే మూలన పడిపోయింది.

#4. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ఏళ్లుగా అనుకుంటున్నాడు. అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఎందుకో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళకుండానే ఆగిపోయింది.

#5. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరో అనుకున్నాడు కానీ అది కూడా కుదరలేదు. అదే కధ మార్చి ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ చేశాడంటూ అప్పట్లో సినీ విశ్లేషకులు చెప్పుకున్నారు.

#6. అలాగే మాస్ దర్శకుడు వివి వినాయక్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది. అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా చేశారు కానీ ఎందుకో ఈ సినిమా కూడా ఆదిలోనే ఆగిపోయింది.

#7. అలాగే తమిళనాడు హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ కూడా చేసిన తర్వాత ఈ సినిమాను ఎందుకో ఆపేశారు.

Previous articleఈ సీన్ యాడ్ చేసి ఉంటే…”హనుమాన్” సినిమాకి థియేటర్ లో రెస్పాన్స్ మాములుగా ఉండేది కాదు.!
Next article“చంద్రముఖి”లో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సీరియల్ లో.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.