Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలిసింది. ఆయన చాలా సాదాసీదాగా జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత కుటుంబ జీవితం కంటే ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండడానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే తాజా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.
ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. వీరితోపాటు అల్లు అరవింద్ కుటుంబం మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సంక్రాంతి సంబరాలలో మునిగిపోయారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు ఆ అకిరా, ఆధ్య కూడా హాజరయ్యారు.
Ads
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉన్నారు. సంక్రాంతిలో అమరావతిలో రాజధాని రైతులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కనుమ రోజు తన ఫామ్ హౌస్ లో గోవుల మధ్య కనుమ వేడుకలు జరుపుకున్నారు. పశువులకు పండ్లు తినిపిస్తూ వాటి మధ్య కాసేపు గడిపారు.
రైతుల పండగ సంక్రాంతి నాడు రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులు కూడా కుటుంబంలో భాగమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. కుటుంబమంతా ఒక చోట చేరి ఆనందంగా గడుపుతుంది పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో కలిసి పండగ చేసుకున్నారు. ఇది చూసి పవన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా పవన్ కళ్యాణ్ అంటే… ఇదే కదా ఆయన అసలైన వ్యక్తిత్వం… అంటూ కామెంట్లు చేస్తున్నారు. జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ ని ఊరికనే అనరు అని ఈ ఉదాహరణ చూపిస్తున్నారు